Friday, April 19, 2024
- Advertisement -

అన్ని కోట్లా: కుమారి సుకుమార్ ను కోటీశ్వరుడిని చేసేసింది…!

- Advertisement -

ఇది వరకూ నిర్మాతగా ఏదో ప్రయత్నం చేసినట్టుగా ఉన్నాడు దర్శకుడు సుకుమార్. అయితే అప్పుడు ఒట్టి ప్రశంసలు మాత్రమే దక్కాయి. నిర్మాతగా మంచి సినిమా తీశాడనే పేరును తెచ్చుకున్నాడు. మంచి ప్రయత్నం అనే పేరు వచ్చింది కానీ.. అప్పుడు డబ్బులు రాలేదు. సెన్సిబుల్ లవ్ స్టోరీ తో అలాంటి అనుభవం మిగలగా.. ఇప్పుడు బోల్డ్ స్టోరీతో మాత్రం సుకుమార్ కు బాగా వర్కవుట్ అవుతోంది.

సుకుమార్ కు ఇప్పుడు రికార్డు స్థాయి లాభాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.కుమారి 21 ఎఫ్ పాజిటివ్ టాక్ తో తొలి వారంలోనే ఏకంగా ఆరుకోట్లరూపాయలు సంపాదించుకొంది. ఇంకా ఈ సినిమా మంచి కలెక్షన్లతోనే సాగుతోంది. దీంతో ఏతావాతా ఈ సినిమా పదిహేనుకోట్ల రూపాయల వరకూ సంపాదించుకునే అవకాశాలున్నాయి.

ఈ మేరకు సుకుమార్ ఖాతాలో జమ అయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే ఈ సినిమా టెలికాస్ట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. సినిమా పెద్ద హిట్ కాబట్టి శాటిలైట్ రైట్స్ రికార్డు స్థాయి మొత్తం పలికే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా రీమేక్ రైట్స్ విషయంలో కూడా బాగానే పోటీ ఉందని తెలుస్తోంది.

అనేక మంది పక్క భాషల నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారట. మరి రీమేక్ రైట్స్ తో కూడా బాగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా సకుమార్ ని  ఈ కుమారి కోటీశ్వరుడిని చేసినట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -