Saturday, May 11, 2024
- Advertisement -

నాగార్జున ఇలా కథలను కాపీ కొట్టేస్తే ఎలా..?!

- Advertisement -

నాగార్జున, కార్తీలు హీరోలుగా… రూపొందుతున్న ద్విభాషా సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఇది. ఈ సినిమా కథను కాపీ కొట్టారని తెలుస్తోంది. ఇదొక ఫ్రెంచ్ సినిమా కు కాపీ అని సమాచారం.

దాని పేరు “ఇన్ టచబుల్స్”. వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఈ విధంగా కాపీ చేస్తున్నారు. మరి ఇద్దరు పెద్ద హీరోలు.. రెండు భాషల్లో రూపొందుతున్న సినిమా అంటే… అదేదో కొత్తగా ఉంటుందని.. మల్టీ స్టారర్ సినిమా కాబట్టి… గొప్పగా ఉంటుందని అనుకొంటే.. అది కాస్తా కాపీ అని ముందుగానే అర్థం అయిపోవడం విశేషం.

ఈ విషయాన్ని కూడా నాగార్జున ధ్రువీకరించాడు. ఈ సినిమాను ఇన్ టచబుల్స్ అనే సినిమా ఆధారంగా రూపొందిస్తామని ప్రకటించాడు. మరి ఈ విషయాన్ని ముందగానే చెప్పకుంటే… తీరా సినిమా విడుదల అయిన తర్వాత అయినా ఆ విషయం అందరికీ అర్థం అవుతుందని… ఈ యూనిట్ కు అర్థం అయినట్టుగా ఉంది. అందుకే… ఈ సినిమాను తాము ఫ్రెంచ్ సినిమాకు కాపీగా రూపొందిస్తున్నామని ముందుగానే చెప్పేస్తున్నారు.

అయినా ఇలా కథలను కాపీ కొట్టేస్తే ఎలా? ఎలాగూ ఫ్రెంచ్ సినిమా అంటున్నారు కాబట్టి.. దీని హక్కులు కొనడం అయితే జరుగుతూ ఉండదు. హక్కులూ గట్రా కొనేయకుండానే కథను కాపీ కొట్టి ఉండవచ్చు. మరి పెద్ద హీరోలే ఇలా చేసేస్తే ఎలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -