Friday, May 10, 2024
- Advertisement -

ఆ సామాజికవర్గానికి జగన్ ప్రాధాన్యతను ఇస్తున్నాడు!

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్ష నేతగా నియమితం అయ్యాడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఇటీవలే వైకాపా తరపున శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ఉమ్మారెడ్డికి ఇప్పుడు అక్కడ అధ్యక్ష స్థానం కూడా లభించింది.

శాసనమండలిలో ఆయన వైకాపాకు అధ్యక్షత వ్యవహరిస్తాడు. ప్రస్తుతానికి అయితే ఇంకా శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష పార్టీగా ఉంది. త్వరలోనే ఈ హోదా వైకాపాకు దక్కుతుంది.

అప్పుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యే అవకాశం ఉంది. మరి కాపు సామాజికవర్గానికి చెందిన ఒక నేతకు వైకాపా అధినేత ఈ విధంగా ప్రాధాన్యతను ఇస్తుండటం విశేషం. ఒకవైపు పార్టీలో బొత్స సత్యనారాయణకు కూడా వైకాపాలో మంచి ప్రాధాన్యత దక్కుతోంది. వైకాపాలో ఇప్పుడు సత్తిబాబు మోస్ట్ పవర్ ఫుల్ అని కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపులకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇటు బొత్స.. అటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పార్టీలో వారి పట్టు పెరుగుతోంది. మరి జగన్ కూడా వ్యూహాత్మకంగానే కాపులకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విధంగా ముందుకు పోతున్న జగన్ కాపుల మదిని పూర్తి స్థాయిలో గెలుచుకోగలడా?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -