Saturday, May 18, 2024
- Advertisement -

సభలో అంతా ఏకపక్షం.. జగన్ పై కస్సుమంటున్న బాబు!

- Advertisement -

శాసనసభ సమావేశాలు మళ్లీ మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రతిపక్షం, అధికార పక్షాల మధ్య రచ్చ కూడా మొదలైంది. తొలి రోజే  సభలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ల మధ్య దూషణ సంభాషనలు జరుగుతున్నాయి.

తొలి రోజు సంతాప తీర్మానాల సమయంలోనే ఇరు పార్టీల మధ్య దూషణలు జరగడం విశేషం. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ తో ఆత్మహత్యలు చేసుకొన్న వారికి సంతాపం ప్రకటించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవ చెలరేగింది.

ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ఆత్మహత్య మృతులకు సంతాపం ప్రకటించారు. ప్రత్యేక హోదా ఆలస్యం అవుతోందని ఆత్మహత్యలు చేసుకొన్నారని బాబు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆలస్యం అవుతోందని కాదు… ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రుల ప్రకటనల వల్లనే ఆత్మహత్యలు నమోదయ్యాయని జగన్ అన్నారు. దీంతో బాబుకు తీవ్ర ఆగ్రహోద్రిక్తుడయ్యాడు.

జగన్ మాట్లాడింది అర నిమిషమే అయినా.. ఆయనకు మైక్ కట్ చేసి బాబు రెచ్చిపోయారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు జగన్ పై దుమ్మెత్తిపోశారు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారని… అంటూ బాబు విరుచుకుపడ్డాడు. మరి ఇక్కడ టాపిక్ ప్రత్యేక హోదా విషయంలో జరిగిన ఆత్మహత్యల విషయంలో అయినా… బాబు జగన్ పై అవినీతి ఆరోపణలు చేశాడు. ఇంకా ఏదేదో మాట్లాడాడు. ఇదంతా గమనించాకా… మాత్రం సభ మొత్తం ఏకపక్షంగా జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -