- Advertisement -

నారా వారబ్బాయి అవుట్ ఫోకస్లోకి వెళ్లిపోతున్నాడా..?

- Advertisement -

నారా వారబ్బాయి నారా రోహిత్ అవుట్ ఫోకస్లోకి వెళ్లిపోతున్నాడా అనిపిస్తుంది. ఏం చేసినా గుట్టుగా చేసుకుపోయే మనోడు…. అదేదో గొప్పనుకున్నాడు తప్ప దాని వలన వచ్చే నష్టాన్ని ఊహించలేక పోయాడు.

అదే ఇపుడు సారును సోలోని చేసేసింది. సోలో అంటూ ఏ ముహూర్తానా నారా రోహిత్ అన్నాడో గాని అప్పటి నుంచి మనోడి బతుకు సోలో గానే మిగిలి పోయింది. ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్  కు వచ్చే రోహిత్… ఎందుకనో అంతగా ఫోకస్ కాడు. 

అదే అతనికి ఇబ్బందిగా మారింది. అసలు నారా రోహిత్ సినిమాల్లో తప్ప బయట కనిపించడా అన్నట్లుగా యవ్వారం మారిపోయింది. అతని సినిమా వచ్చిన టైమ్లో మాత్రమే అతను హైలెట్ అవుతున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఒకసారి రోహిత్ ఆలోచించాల్సిన అవసరముంది. సరైన పీఆర్  లేకపోవడం కూడా అతను ఫోకస్లోకి రాకపోవడానికి ఒక కారణమనేది కొందరి వాదన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -