Thursday, May 30, 2024
- Advertisement -

మెగా డాటర్ కి ‘శివగామి’ తల్లి

- Advertisement -

రమ్యకృష్ణ ఇప్పుడు తన వయసుకి తగిన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ‘బాహుబలి’లో శివగామిగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిన ఆమె, ఆ తరువాత ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో నాగార్జున సరసన నటిస్తోంది.

అంతా అనుకున్నట్టుగా జరిగితే, త్వరలో ఆమె ఓ యువ కథానాయికకి తల్లిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.  ఆ యువ కథానాయిక ఎవరో కాదు .. నిహారిక!

మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న ఈ కథానాయిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా వెండితెరకి పరిచయమవుతోంది. మధుర శ్రీధర్ నిర్మాణంలో రామరాజు తెరకెక్కించనున్న ఈ సినిమాలో, ఆమె నాగశౌర్య జోడీగా అలరించనుంది. ఈ సినిమాలో కథానాయిక తల్లి పాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉండటం వలన, దర్శక నిర్మాతలు రమ్యకృష్ణను సంప్రదిస్తున్నారట. మరి రమ్యకృష్ణ ఓకే చెబుతుందో లేదో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -