Monday, May 6, 2024
- Advertisement -

ర‌జ‌నీకాంత్ త‌ర్వాతి సినిమాకు ‘సైరా’ హీరోయిన్ ఓకే

- Advertisement -
సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి దాదాపు 15 ఏళ్లు దాటింది. ఇప్ప‌టివ‌ర‌కు విజ‌య‌వంత‌మైన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ న‌య‌న‌తార‌. సాధార‌ణంగా హీరోయిన్ల సినీ జీవిత‌కాలం ఐదు నుంచి ప‌దేళ్ల‌లోపు మాత్రమే ఉంటుంది. కానీ న‌య‌న్ దాన్ని దాటేసి సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న స్థానం సుస్థిరం చేసుకొని సినిమాలు చేస్తూ వెళ్తోంది. ప్ర‌స్తుతం చిరంజీవి ప‌క్క‌న సైరా సినిమా చేస్తుండ‌గా త‌మిళ్‌లో మ‌రి రెండు సినిమాలు చేస్తోంది.
అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఒక‌సారి త‌లైవా ర‌జ‌నీకాంత్ ప‌క్క‌న న‌టించే అవ‌కాశం కొట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల క‌ర్త‌వ్యం సినిమాతో భిన్న‌మైన క‌థ‌లో హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమాగా న‌య‌న‌తార వ‌చ్చి హిట్ కొట్టింది. ఇప్పుడు చిరంజీవి ప‌క్క‌న ‘సైరా’లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. దక్షిణాది మొత్తం మీద క్రేజీ హీరోయిన్‌గా న‌య‌న‌తార పేరు సంపాదించుకుంటోంది.
ఇప్పుడు రజనీకాంత్‌కు మ‌రోసారి జోడీగా క‌నిపించే అవ‌కాశం ఉంది. ఇంత‌కుముందే ర‌జ‌నీతో చంద్ర‌ముఖి సినిమా చేసిన న‌య‌న‌తార ఆ త‌ర్వాత ర‌జ‌నీతో మ‌రో సినిమా కథానాయకుడు చేసింది. ఈ సినిమాలో చిన్న పాత్రే అయినా అలా క‌నిపించి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడూ ర‌జ‌నీ, న‌య‌న్ క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది అని తెలుస్తోంది.
ప్ర‌స్తుతం ర‌జ‌నీ కాలా సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా కాగా, ఇంకో సినిమా 2.0 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల త‌ర్వాత రజినీకాంత్ చేసిన చివ‌రి సినిమా కార్తీక్ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో. ఇప్ప‌టికే క‌థ వినిపించ‌గా ర‌జ‌నీ ఒకే అన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో నయన్‌ను హీరోయిన్‌గా ఓకే చేశార‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -