Friday, May 3, 2024
- Advertisement -

తెర‌మీద‌కు శ్రీరెడ్డి బ‌యోపిక్ చిత్రం…?

- Advertisement -

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఉన్న కాస్టింగ్ కౌచ్ సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సృష్టించిన హంగామా ఇండ‌స్ట్రీనీ ఓ కుదుపు కుదిపేసింది. సినీప్రముఖులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. తనకు తానుగా పలు వివాదాల్లో చిక్కుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ హడావిడి కొనసాగుతోంది. బాలయ్య, చిరంజీవి వంటి స్టార్ హీరోలంతా బయోపిక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా శ్రీరెడ్డి బ‌యోపిక్‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయంట‌. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం శ్రీరెడ్డి బయోపిక్ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ బయోపిక్ లో శ్రీరెడ్డి తన పాత్రలో తానే నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతా నూతన నటీనటులతో శ్రీరెడ్డి బయోపిక్ చిత్రం తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీరెడ్డి బయోపిక్ చిత్రానికి రెడ్డి డైరీ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నూతన దర్శకుడు అల్లావుద్దీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వచించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి బ‌యోపిక్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -