Thursday, May 2, 2024
- Advertisement -

బిగ్‌బాస్ 2లో తేజ‌స్వి క‌న్నింగ్‌కు బ‌లైపోతున్నారు

- Advertisement -

బిగ్‌బాస్ హౌస్‌లో జ‌న్యూన్‌గా ఆడేవాళ్లే ఉంటారు. క‌న్నింగ్ మెంటాలిటీతో ఏదో ఒక‌టి చేయాల‌ని, ఎవ‌రినో ఒక‌రిని బ్లేమ్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే.. అంతే మెడ‌ప‌ట్టుకుని బ‌య‌ట‌కు గెంటినంత ప‌నిచేస్తారు. హౌస్‌లో ఉన్న 16మందిలో నువ్వెంత పుడింగివైనా కావొచ్చు. మిగ‌తా వారంద‌రినీ డామినేట్ చేసేసి.. నువ్వే పెద్ద తోప‌ని ఫీల‌వ‌చ్చు. కానీ.. అంతిమంగా ప్రేక్ష‌కుల దృష్టిలో ఎవ‌రు హీరోనో వాళ్లే నిల‌బ‌డ‌తారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఇంకో ప్ర‌ధాన‌మైన.. గుర్తుపెట్టుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. ఎవ‌రి ఇన్‌ఫ్లుయెన్స్‌కూ లోన‌వ్వ‌కుండా.. నీకు నువ్వుగా.. ఒంట‌రి పోరాటం చేయాలి.

పాపం.. ఈ విష‌యాలు హౌస్‌లో ఒక్క కౌశ‌ల్‌కు త‌ప్ప మ‌రెవ‌రికీ అర్థం కావ‌డం లేదు. కౌశ‌ల్ మిగ‌తా వారికి ఈ విష‌యం అర్థ‌మ‌య్యేలా చెబుతున్నా.. అబ్బే ప‌ట్టించుకుంటేగా. తీరా అన‌ర్థం ముంచుకొచ్చాక‌.. కుయ్యో మొర్రో అని మొత్తుకుంటున్నా.. వినే నాథుడు ఉండ‌డం లేదు. బ‌య‌ట‌కొచ్చాక కానీ.. వారికి జ‌రిగిన పొరాపాటు ఏంట‌నేది అర్థం కావ‌డం లేదు. దీనంత‌టికీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఒకే ఒక్క వ్య‌క్తి కార‌ణంగా మారుతోందని బ‌య‌ట‌కొచ్చిన వారంతా గుర్తించి.. అరే అన‌వ‌సరంగా ఆమె మాట విన్నామంటూ త‌ల‌బాదుకుంటున్నారు. ఆ ఒక్క‌రు ఎవ‌రో మీక‌ర్థ‌మైపోయింది క‌దా. మీ ఊహ నిజ‌మే.. తేజ‌స్వి. ఈ ఒక్క కంటెస్టెంట్ హౌస్‌లో దారి త‌ప్ప‌డంతో.. మ‌ధ్య‌లో ఉన్న వాళ్లు బ‌లైపోయి బ‌య‌ట‌కొచ్చేస్తున్నారు.

హౌస్‌లో బ‌ల‌మైన కంటెస్టెంట్ కౌశ‌ల్‌. ఇత‌డిపై కోపంతో ఉన్న తేజ‌స్వి.. అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారీ తాను రెచ్చిపోయి అత‌నిపై దాడి చేయ‌డ‌మే కాకుండా.. ఎవ‌రో ఒక బ‌క‌రానూ బుక్ చేస్తోంది. వారిని మ‌ధ్య‌లో పెట్టి కౌశ‌ల్‌ను కార్న‌ర్ చేయాల‌ని చూస్తోంది. అయితే.. అలా కౌశ‌ల్‌ను కార్న‌ర్ చేయ‌డానికి తేజ‌స్వి ఎవ‌రినైతే వాడుకుంటోందో.. స‌ద‌రు కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేష‌న్‌లో ఉండ‌డం.. జ‌రిగిన త‌ప్పు తెలిసేలోగా.. బ‌య‌ట‌కు నెట్టేయ‌బ‌డ‌టం జ‌రుగుతోంది. ఇలా ఇప్ప‌టివ‌ర‌కూ హౌస్‌లో బ‌ల‌మైన కంటెస్టెంట్‌లుగా ఉన్న కిరీటి, భానుశ్రీ బ‌లైపోయి తేజ‌స్వి దెబ్బ‌కే ఎలిమినేట్ అయిపోయారు. వారిని అవ‌స‌రం లేక‌పోయినా.. కౌశ‌ల్‌పైకి రెచ్చ‌గొట్టి పంపించిన తేజ‌స్వి మాత్రం హౌస్‌లో సేఫ్‌గా ఉండిపోయింది.

కిరీటికి అస‌లు కౌశ‌ల్‌తో గొడ‌వే లేదు. కానీ.. రెచ్చ‌గొట్టి పంపింది. భానుశ్రీకి కౌశల్‌తో చిన్న స‌మ‌స్య ఉన్నా.. అదంత పెద్ద‌దేం కాదు. కానీ.. తేజ‌స్వి దూరిపోయి గొడ‌వ పెంచేసింది. అంతే వాళ్లిద్దరూ బ‌య‌ట‌కొచ్చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అంత‌కుముందు హౌస్ నుంచి వెళ్లిపోయిన‌.. సంజ‌న‌, నూత‌న్‌నాయుడుని సైతం తేజ‌స్వి, సామ్రాట్‌, త‌నీష్ టార్గెట్ పెట్టి ఎలిమినేట్ చేసి బ‌య‌ట‌కు వెళ్లేలా చేశారు. ఇలా.. ఒక్కొక్క‌రినీ పంపేస్తూ.. తేజ‌స్వి మాత్రం ఇన్నాళ్లూ సేఫ్ గేమ్ ఆడింది. కాక‌పోతే.. పాపం ఎప్ప‌టికైనా పండ‌కుండా ఉండ‌దు. ఈ వారం ఎలిమినేష‌న్‌లోనికి తేజ‌స్వి వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తేజ‌స్వికి ఓటేసే వాళ్లు ఒక్క‌రు కూడా ఉండ‌ర‌నేది.. సోష‌ల్ మీడియా చూసే వారెవ‌రికైనా అర్థ‌మైపోతుంది. ఈ లెక్క‌న తేజ‌స్వి బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌దు. ఒక‌వేళ బిగ్‌బాస్ నిర్వాహ‌కులు తేజ‌స్విని ఉంచితే త‌ప్ప ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్రేక్ష‌కుల త‌ర‌ఫున ఓట్లు గెలుచుకుని తేజ‌స్వి ఉండేందుకు అవ‌కాశ‌మే లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -