Friday, May 3, 2024
- Advertisement -

మోడీని బోనులో నిలబెట్టిన బాబు అనుభవం

- Advertisement -

ఏపీకి ప్రత్యేకహోదా మోసంపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నరేంద్రమోడీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బోనులో నిలబెట్టారు. ఆంధ్రులకు చేసిన అన్యాయంపై కచ్చితంగా మోడీ సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించారు. ఏ పార్లమెంట్ సాక్షిగా హామీలు ఇచ్చి, తుంగలో తొక్కారో అదే పార్లమెంట్ సాక్షిగా మౌనం వీడాల్సిన స్థితిలోకి నెట్టారు. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడతామని బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే ఇక్కడే చంద్రబాబు రాజకీయ చాణక్యం బయటపడింది. గత బడ్జెట్ సమావేశాల్లో 12 రోజుల పాటు టీఆర్ఎస్, అన్నాడీఎంకేను అడ్డం పెట్టుకుని, అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా పారిపోయిన మోడీ దేశవ్యాప్తంగా విమర్శల పాలయ్యారు. పూర్తి మెజార్టీ ఉండి కూడా ఓ ప్రాంతీయ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టలేకపోయిన పిరికిపందలుగా బీజేపీ నేతలు చరిత్రలోకెక్కారు.

వాజ్ పేయ్ ప్రభుత్వ హయాంలో ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించడంతో పాటు అనేక విజయాలు సాధించారు. రాజకీయ ఉద్ధండుడైన చంద్రబాబు, మోడీ చేసిన అన్యాయంపై దేశవ్యాప్తంగా అన్ని విపక్షాలను ఏకం చేసి, మద్దతు కూడగట్టి, మోడీని దోషిగా నిలబెట్టారు. ఏపీకి న్యాయం చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన ఆయన, ఆ తర్వాత కాంగ్రెస్ కంటే దారుణంగా మోసం చేశారని ఆరోపిస్తూ పెట్టిన అవిశ్వాసంపై మోడీ బలనిరూపణ చేసుకోలేక పారిపోయారనే చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ఈ ఒక్క ఎపిసోడ్ తో బాబు హీరో, మోడీ జీరో అయిపోయారు.

కావేరి బోర్డు ఏర్పాటుతో ప్రస్తుత సమయంలో అన్నాడీఏంకే ఎలాంటి ఆందోళన చేపట్టే పరిస్థితి లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెడతాను, జాతీయ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తాను అని ప్రగల్భాలు పలికే కేసీఆర్ పార్టీ కుడా ఇప్పుడు సభలో సైలెంట్ గా ఉండాల్సిందే. లేదంటే బీజేపీని ఇరుకున పెట్టాల్సింది పోయి, గత సమావేశాల్లో ఆడినట్టే మళ్లీ డ్రామా ఆడుతున్నారని విమర్శల పాలవటం ఖాయం. కనుక బీజేపీ పోయిన పరువును దక్కించుకోవడానికి, జాతీయ రాజకీయాల్లో హీరో అయిపోయిన చంద్రబాబు క్రెడిట్ తగ్గించడానికే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించింది. పైగా గత సమావేశాల్లో సభ ఆర్డరులో లేదు కనుకే, అవిశ్వాసంపై చర్చించలేకపోయామనే చౌకబారు సమాధానం చెప్పుకొచ్చారు. సభను సజావుగా నడపలేని అసమర్ధులా బీజేపీ నేతలు ? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపించింది. సభనే నడపలేని వాళ్లు దేశాన్ని ఏం పాలిస్తారని జనం నిలదీశారు. పైగా ప్రజాస్వామ్య దేశంలో అవిశ్వాసం పెట్టినప్పుడు, కచ్చితంగా బలనిరూపణ చేసుకోవాలి కానీ ఇలా పారిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేంటని జనం మండిపడ్డారు. ఆ ప్రభావంతో ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.

ఇప్పుడు కూడా చర్చ చేపట్టకపోతే మోడీ ప్రభుత్వం మూటగట్టుకునే అప్రతిష్ఠ అంతాఇంతా కాదు. చంద్రబాబు తెరవెనుక చక్రం తిప్పాడు. బీజేపీ నుంచే వ్యతిరేక ఓట్లు పడతాయి. మోడీ పని ఔట్. అందుకే భయపడి అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశమివ్వడం లేదు. బలనిరూపణ చేసుకోవడం లేదు. అనే విమర్శలతో కమలనాథులు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే. మెజార్టీ ఉండి కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కోలేక పోతున్నారంటే, వారిపై ఎన్టీఏ, బీజేపీ నేతల్లో విశ్వాసం తగ్గిందనే సంకేతాలు కచ్చితంగా వెళ్తాయి. అందుకే టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టి, బలనిరూపణ చేసుకుని, ఆ ఎపిసోడ్ కు ముగింపు పలుకుదామని బీజేపీ నిర్ణయించింది. చర్చ లేకుండా దాటవేస్తే మళ్లీ అప్రతిష్ఠ తప్పదని, బాబు మళ్లీ హీరో అయిపోతారనే భయంతోనే శుక్రవారం చర్చకు సిద్ధమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -