Friday, May 3, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో ఈ వారం తేజ‌స్వి ఔట్‌…?

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది వీక్షించే బిగ్‌బాస్‌లో ఈ వారం సీను ర‌స‌వ‌త్త‌రంగా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లో ల‌క్ష‌ల మంది అస‌హ్యించుకునే ఏకైక కంటెస్టెంట్ తేజ‌స్వి. ఆమె చేసే ప‌నులు, మాట్లాడే మాట‌లు సామాన్యుల‌కు ఏవ‌గింపును క‌లిగించ‌డ‌మే దీనికి కార‌ణం. సోష‌ల్‌మీడియాలో గ‌త కొంత‌కాలంగా ఎక్క‌డ చూసినా.. ఎవ‌రిని క‌దిపినా.. బిగ్‌బాస్ అన‌గానే.. తేజ‌స్వి ఉంటే చూడాల‌నిపించ‌డం లేదండి, ఆమెను బ‌య‌ట‌కు పంపిస్తేనే చూస్తామంటూ.. మ‌హిళ‌లు, అమ్మాయిలు, యువ‌కులు చెబుతూనే ఉన్నారు. వారంద‌రి మాట ఈ వారం నిజం కాబోతోంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం తేజ‌స్వి బ‌య‌ట‌కొచ్చేయ‌డం ఖాయంగా క‌న్పిస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో యువ‌త‌కు ఫేవ‌రెట్ కంటెస్టెంట్‌గా కౌశ‌ల్ మారిపోయాడు. తేజ‌స్వి ఎప్పుడూ కౌశ‌ల్‌ను టార్గెట్ చేస్తూ.. తీవ్ర వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టుకుంది. తాజాగా సోమ‌వారం జ‌రిగిన ఎలిమినేష‌న్ జాబితాలో తేజ‌స్వి పేరు కూడా చేరింది. ఆమెతో పాటూ మ‌రో న‌లుగురు సైతం జాబితాలో ఉన్నారు. వీళ్లు హౌస్‌లో ఉండాలా.. వ‌ద్దా అనేది నిర్ణ‌యించే రిమోట్ కంట్రోల్ ప్రేక్ష‌కుల చేతిలో ఉంటుంది. ప్రేక్ష‌కులు వేసే ఓట్లు ఎవ‌రికి ఎక్కువ ఉంటే.. వాళ్ల‌నే హౌస్‌లో ఉంచుతారు. కానీ.. తేజ‌స్వికి ఓట్లు ప‌డే ఛాన్సే లేదు. ఒక్కరు కూడా ఆమెకు ఓటు వేసేందుకు ముందుకొచ్చే ప‌రిస్థితులైతే లేవు. పోనీ.. ఒక‌రిద్ద‌రు జాలిప‌డి వేద్దామ‌ని అనుకున్నా.. తాజాగా మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన ఎపిసోడ్‌లోనూ తేజ‌స్వి ర‌చ్చ రంబోలా చేసింది. త‌న పైత్యం పీక్స్‌కు తీసుకెళ్లి.. బిగ్‌బాస్ వీక్ష‌కుల‌కు ప‌ర‌మ చిరాకు తెప్పించింది.

ఎలిమినేష‌న్ జాబితాలో ఉన్నా.. కుక్క‌తో క వంక‌ర‌న్న చందంగానే తేజ‌స్వి ప్ర‌వ‌ర్త‌న అస్స‌లు మార‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు తాను ఎవ‌రినీ హ‌ర్ట్ చేయ‌కూడ‌ద‌ని ప్రామిస్ చేశానంటూ.. క‌ళ్ల‌బొళ్లి క‌బుర్లు చెబుతూ.. మ‌ళ్లీ త‌న పాత పంథాలోనే వెళుతోంది. తేజ‌స్వి.. కౌశ‌ల్ విష‌యంలో త‌న పైత్యం ప‌తాక స్థాయిలో మంగ‌ళారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ప్ర‌ద‌ర్శించింది. త‌న గ్యాంగ్ స‌భ్యులు సామ్రాట్‌, త‌నీష్‌, దీప్తి సున‌య‌న‌ను మ‌ళ్లీ తాజాగా ఒక‌టిగా చేసేసి.. వాళ్ల‌తో క‌లిసి ముచ్చ‌ట పెడుతూ.. మ‌ళ్లీ కౌశ‌ల్‌ను కార్న‌ర్ చేసింది. ఒరేయ్ మీకో విష‌యం తెలుసా.. నిన్న జ‌రిగిన ఎలిమినేష‌న్ విష‌యంలో సామ్రాట్‌కు ఎలిమినేష‌న్ విష‌యంలో సాయం చేస్తాన‌ని కౌశ‌ల్ చెప్పాడంట‌.. వాడికంత సీనుందా.. అస‌లు వాడి మాటలు ఎవ‌రైనా న‌మ్ముతారా.. అంటూ కార్న‌ర్ చేసింది. దీనికి దీప్తి సున‌య‌న‌.. సైతం పెద్ద‌గా న‌వ్వుతూ.. నేనైతే న‌మ్మా.. అంటూ త‌న పైత్యం కూడా ప్ర‌ద‌ర్శించింది. ఇక్క‌డితో ఆగ‌కుండా.. అంత‌కుముందు రోజు అమిత్ తివారీ అంద‌రితో తిట్టు తిన్న సీక్రెట్ టాస్క్‌ను నిజానికి బిగ్‌బాస్ కౌశ‌ల్‌కు ఇవ్వాల‌ని ప్లాన్ చేశాడ‌ట‌, కాక‌పోతే.. అమిత్ దానిలో చిక్కుకోవ‌డం జ‌రిగింద‌ని, లేదంటే కౌశ‌ల్ ఈ వారం ఎలిమినేష‌న్ జాబితాలో ఉండేవాడ‌ని, బిగ్‌బాస్ ప‌గ‌బ‌ట్టి కౌశ‌ల్‌ను బ‌య‌ట‌కు గెంటేసేవాడంటూ.. తేజ‌స్వి త‌న కుళ్లంతా బ‌య‌ట‌కు క‌క్కేసింది. అంటే.. కౌశ‌ల్‌పై త‌న‌కే కాదు.. బిగ్‌బాస్‌కు సైతం కోపం ఉందనేలా చెప్పుకొచ్చింది. అస‌లు బిగ్‌బాస్ బ‌య‌ట ఇప్ప‌టికే కౌశల్ జోలికొచ్చే వారంద‌రినీ బ‌య‌ట‌కు గెంటేసే ప‌నిని ప్రేక్ష‌కులు త‌మ భుజాల‌పై వేసుకున్నార‌నే విష‌యం.. తెలిస్తే తేజ‌స్వి ఉరేసుకోవ‌డం ఖాయ‌మే. గుండె ప‌గిలి.. పెడ‌బొబ్బ‌లు పెడుతూ.. కుప్ప‌కూలిపోతుందేమో.

ఏదేమైనా మ‌రోసారి కౌశ‌ల్‌ను కార్న‌ర్ చేసి.. జ‌నానికి రోత పుట్టించి.. త‌న ఎలిమినేష‌న్ బెర్త్‌ను తేజ‌స్వి దిగ్విజ‌యంగా ఖాయం చేసుకుంద‌న్న విష‌యమైతే అంద‌రికీ అర్థ‌మైపోయింది. ఇప్పుడు కౌశ‌ల్ ఫ్యాన్స్ తేజ‌స్విని బ‌య‌ట‌కు పంపించేందుకు.. రోల్‌రైడా, టీవీ9 దీప్తికి తెగ ఓట్ల‌ను గుద్దేయ‌డ‌మే కాదు.. వీరికి ఎలా ఓటింగ్ చేయాల‌నే విష‌యాన్ని సైతం తెగ ప్ర‌చారం చేస్తున్నారు. షో.. ఎలా చూసినా.. తేజ‌స్విని ఈసారి బ‌య‌ట‌కు గెంటేయ‌డం ఖాయ‌మైన‌ట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -