Thursday, May 2, 2024
- Advertisement -

బిడ్డ‌కు పాలిస్తు మోడ‌ల్ ర్యాంప్ వాక్‌

- Advertisement -

ఇప్ప‌టి యువ‌త‌రనికి పెళ్లిపై అనేక అపోహాలు ఉన్నాయి.కొంత‌మంది పెళ్లి చేసుకున్న త్వర‌గా త‌ల్లి కావ‌డానికి ఇష్ట ప‌డ‌టం లేదు.బిడ్డలకు పాలివ్వడం ద్వారా త‌మ అందచందాలు పోతాయని ఫిజిక్ పాడవుతుందని కొంద‌రు భావిస్తున్నారు.అలాంటి వారికి చెంప మీద లాగి కొట్టినట్లు చేసింది ఈ మోడ‌ల్‌.బిడ్డలకు పాలివ్వడం అనేది ఈ సృష్టిలో తల్లికి మాత్రమే దక్కిన గొప్ప అదృష్టం.తల్లి పాలే బిడ్డకు శ్రేష్టం అని ఎంతమంది చెప్పినా కూడా కొందరు డబ్బా పాలతోనే పిల్లలను పెంచుతుంటారు. ఇలా ఎన్నో అపోహలు సమాజంలో గూడుకట్టుకొని ఉన్నాయి.

వాటన్నింటిని తొలగించేందుకు తాజాగా ఓ మహిళా మోడల్ ముందుకొచ్చింది.ఈ మోడ‌ల్ బికిని వేసుకుని త‌న‌కు పుట్టిని బిడ్డ‌తో ర్యాంప్ వాక్ చేసింది. మోడలింగ్ రంగంలో కూడా చాలా మంది మహిళలు బిడ్డలకు పాలు ఇవ్వడానికి సందేహిస్తారు.కానీ ఈ మోడల్ ఇదంతా సిగ్గుపడాల్సిన విషయం కాదని చాటింది. స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్ మారా మార్టిన్ ఈ మేరకు చేసిన పని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -