- Advertisement -

నయనతార అభిమానుల ఓవర్ యాక్షన్

- Advertisement -

‘ అందం ‘ అందరూ కోరుకునే ఆయుధం, ఆధారం. ప్రతీ మనిషీ ఆ మాటకొస్తే ప్రతీ జీవీ అందంగా కనిపించాలి అని కోరుకుంటుంది.

శరీర కొలతల దగ్గర నుంచే కలర్ వరకూ అందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. కానీ సినిమా వాళ్ళ విషయం లో అది కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. వారు అందంగా కనిపించి తీరాల్సిన ఫీల్డ్ కావడం తో తాము తినే తిండిని సైతం లెక్కలు వేసుకుంటూ తింటూ ఉంటారు వారు.సంచలన నటి నయనతారకు సంబంధించింది.

అందుకే నయనతారను అందాల గని అని చెప్పలేముగానీ కచ్చితమైన శరీర కొలతలతో చూపరులను ఆకర్షించే అందం ఆమెది. శరత్‌కుమార్‌కు జంటగా అయ్యా చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమై తొలి చిత్రం విజయాన్ని అందుకున్న అదృష్ట నటి నయనతార. ఈ మధ్య కాలం లో నయనతార అందం గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది, ఆమె మూడు పదుల వయసు దాటేయడం తో హీరోయిన్ గా ఎన్నాళ్ళు రాణిస్తుంది అనేది పెద్ద ప్రశ్న, సినిమాల అఫర్లూ, పారితోషికాలూ అయితే అదిరిపోతున్నాయి కానీ ఆమె ఇంకా ఎన్నాళ్ళు తన అందం తో నేట్టుకోస్తుంది అంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు  అభిమానులతోనే కొత్త చిక్కొచ్చి పడింది .

ఇటీవల నయనతార అందం గురించి ఆమె కంటే అభిమానులే ఎక్కువగా బాధ పడిపోతున్నారట. అంతటితో ఆగిపోకుండా చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బ్రైట్‌గా బాగున్నా.. మరి కొన్ని సన్నివేశాల్లో చాలా డల్‌గా ఉంటున్నారంటూ నయనతో చెప్పేశారట. అభిమానుల అభిప్రాయాలకు ముందు కాస్త బాధ పడినా ఆ తరువాత తేరుకుని ఇకపై అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్ణయించుకున్నారట.షాట్ పూర్తి అవగానే వీడియో మానిటర్ లో ఇది వరకు నటన గురించి చూసుకునే ఆమె అందం గురించి చెక్ చేసుకుంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -