Sunday, May 26, 2024
- Advertisement -

‘ఇజం’ మూవీ రివ్యూ!

- Advertisement -
ism movie review in telugu

టాలీవుడ్ డాషింగ్ డైరెక్షర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇజం’. ఈ సినిమా ఫస్ట్ లుక్స్, టీజర్ అద్భుతంగా ఉండటం.. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించడం తో ఈ సినిమాపై అభిమానులో భారీ అంచనాలు ఏర్పడాయి.

ఈ సినిమాలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇన్ని అంచనాలతో ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

సత్య మార్తాండ్ (కళ్యాణ్ రామ్) అనే భాద్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రాభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను, దోపిడీని, పేదలు, రైతుల కష్టాలను చూసి తట్టుకోలేక, వాటికి కారణమైన రాజకీయనాయకులు, దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావెద్ భాయ్ (జగపతి బాబు) ను టార్గెట్ చేసుకుంటాడు. అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబుకు ఎలా దగ్గరయ్యాడు ? అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు ? దాన్ని పేద ప్రజలకు ఎలా పంచాడు ? అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయంలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది కళ్యాణ్ రామ్ గురించి. ఇంతకు ముందు ఏ సినిమాలో చేయని విధంగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజన్స్, అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతని డైలాగ్ డెలివరీ, మ్యానరిజం, ఎమోషనల్ సన్నివేశంలో చూపించిన హావభావాలు చాలా బాగున్నాయి. కళ్యాణ్ రామ్ ను పూర్తిగా మార్చేసి కొత్తగా చూపించడంలో పూరి సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఎలివేషన్, పెర్ఫార్మెన్స్ తో బాగానే సాగిపోయింది. ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సినిమా మొత్తానికీ హైలెట్ గా నిలిచింది. ఫస్టాఫ్ లో జగపతి బాబుకి, కళ్యాణ్ రామ్ కి మధ్య బీడీ స్నేహం, హీరోయిన్ అధితి ఆర్యకు, కళ్యాణ్ రామ్ కు మధ్య లవ్ సీన్స్ కొన్ని బాగున్నాయి. పాటలు కూడా సందర్భానుసారంగా వస్తూ మంచి ఫీల్ ని ఇచ్చాయి. ముఖ్యంగా పూరి పాడిన పాట బాగుంది.

మైనస్ పాయింట్స్ :

మైన్స్ పాయింట్స్ విషయంకు వస్తే.. ముందుగా చెప్పుకోవలసింది సెకండాఫ్ గురించి.  ప్రీ క్లైమాక్స్ మినహా మిగతా సన్ని వేశాలు అన్ని బోర్ గా ఉంటాయి. అలాగే జావెద్ భాయ్ గా విలన్ జగపతిబాబుని మొదట్లో ఓ రేంజ్ లో చూపించి ఆ తరువాత పూర్తిగా తేల్చేశాడు.  క్లైమాక్స్ లో ఇండియాలో జరుగుతున్న కరెప్షన్ కి అండగా నిలిచిన జగపతిబాబుని ఏమాత్రం నొప్పించకుండా ఫ్రీగా వదిలేయడం హీరో లక్ష్యాన్నే దెబ్బ తీసేదిగా ఉండి నిరుత్సాహపరిచింది. అలాగే హీరోయిన్ అధితి ఆర్య తో ఇంకాస్త పెర్ఫార్మెన్స్ చేయించి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ను హడావుడిగా ముగించేశారు. హీరో నల్ల ధనాన్ని ఇండియాకు తిరిగి తెప్పించడానికి, దోపిడీదారులను బయటకు లాగడానికి చేసిన ప్రయత్నాన్ని రఫ్ గా చూపించేసి వదిలేశారు. దాన్ని ఇంకాస్త వివరంగా చూపించి ఉంటే బాగుండేది.

మొత్తంగా:

‘ఇజం’ సినిమా నటుడిగా కళ్యాణ్ రామ్ ని మరో స్థాయిని కి తీసుకెళ్లిన సినిమా అని చెప్పోచ్చు. ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్టాఫ్, కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజన్స్, పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, పాత సోషల్ సబ్జెక్టు కు పూరి ఇచ్చిన కొత్త, ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా.. బోరింగ్ సెకండాఫ్ కథనం, జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం, హడావిడిగా క్లైమాక్స్ ను చుట్టేయడం ఇందులో మైనస్ పాయింట్స్. సో మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా సోషల్ మెసేజ్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ ‘ఇజం’ బాగా నచ్చుతుంది.

రివ్యూ రేటింగ్: 3.25

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -