రజనీకాంత్ మళ్లీ చికిత్స కోసం వెళ్ళారు!

rajnikanth us tour

సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఏ రెంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఆయన సినిమా వస్తుందటే ఏ రెంజ్ లో అంచనాలు ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. అయితే రజనీకాంత్ తన కబాలి సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపైనే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఇన్నాళ తరువాత అమెరికా వెళ్లారట రజనీకాంత్.

ఎందుకంటే.. మళ్ళీ ఆసుపత్రి లో జాయిన్ అయి చికిత్స తీసుకోవడానికే వెళ్ళాడట. దాంతో అసలు రజనీకాంత్ కు ఏమైంది అన్న ఆందోళన అందరిలో నెలకొంది. రజనీకాంత్ గత నాలుగేళ్ళుగా తీవ్ర అస్వస్థత కు గురి అవుతునే ఉన్నారు. ఆసుపత్రిలో చేరడం, చికిత్స పొందడం జరుగుతూనే ఉంది.

అయితే ఇక్కడ నమ్మకం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళుతున్నారు రజనీకాంత్. తాజాగా రజనీ తో చిన్న కూతురు కూడా అమెరికా వెళ్లిందట. గతకొంత కాలంగా రజనీ చిన్న కూతురు భర్త కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక రజనీ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related

  1. రజనీ ఏ హీరోలను ఫాలో అవుతున్నారంటే?
  2. రజనీ చిత్రంపై సంపూ సెటైర్ వేసాడు
  3. అవార్డులు అందుకున్న రజనీ.. రాజమౌళి
  4. రేప్ అవబోతున్న అమ్మాయిని కాపాడిన రజినీకాంత్ అభిమాని