Thursday, May 16, 2024
- Advertisement -

జ‌య‌సింహా ఆడియో ఫంక్స‌న్‌కు ముఖ్య అతిధిగా లోకేష్‌…

- Advertisement -

చంద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం ఐటీ మంత్రి నారాలోకేష్ రాజ‌కీయ ప‌రిజ్ణానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. లోకేష్ వాక్ చాతుర్యం గురించి చెప్పాలంటే అబ్బో ఇంకేముంది చ‌ప్ప‌ట్లే చ‌ప్ప‌ట్లు. ఆయ‌న నోటినుంచి జాలు వారిని ఆణిముత్యాలు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియాతో టచ్ ఉన్న వాళ్లకు లోకేష్ ‘కామెడీ’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

లోకేష్ ఆణిముత్యాల‌నుం గుర్తు చేస‌కుంటే ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక దేశంగా మార్చేసిన ఘనత ఆయనది. జ‌య‌తంతిని వ‌ర్థంతిగా మార్చిన ఘ‌నుడు. సోషియ‌ల్ మీడియాలోను, సొంత పార్టీ నేత‌లే సెటైర్ల వ‌ర్షం కురిపించారు. అయితే ఇప్పుడు మ‌రో అద్భుతం చోటు చేసుకోబోతోంది. తాజాగా లోకేష్ సినిమా ఫంక్స‌న్‌కు హాజ‌ర‌వుతున్నారు. అది మామూలు పంక్స‌న్ కాదండోయ్‌….స్వయంగా లోకేష్ మామగారు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన జై సింహా సినిమా ఫంక్షన్.

నారా లోకేష్ వాక్-చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాతో టచ్ ఉన్న వాళ్లకు లోకేష్ ‘కామెడీ’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక దేశంగా మార్చేసిన ఘనత ఆయనది. ఈ మంత్రిగారిపై సదరు పార్టీలోని నేతలే కాకుండా సోషియ‌ల్ మీడియాలో జోకులు పేలాయి. విజయవాడలో జరగనున్న ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ నారా లోకేష్.

మామూలుగా మాట్లాడాలంటే లోకేష్ త‌డ‌బ‌డ‌తాడు. కాని ఇది సినిమా ఫంక్స‌న్. అది కూడా కొత్త‌…మ‌రో వైపు మామ ముందు మాట్లాడాలి. ఈసారి లోకేష్ నోటి నుంచి ఇంకెన్ని ‘ఆణిముత్యాలు’ జాలువారతాయోనని అంతా ఎదురుచూస్తున్నారు. సిద్దార్థ్ స్కూల్ గ్రౌండ్ లో జరగనున్న జైసింహా ఫంక్షన్ లో మంత్రిగారు తనకు తెలియకుండానే ఇంకెన్ని పంచ్ లు పేలుస్తారో చూడాలి.

ఇక మామ కాల‌య్య‌గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలయ్యను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. తన ప్రసంగాన్ని ఎటు ప్రారంభించి ఎటు ముగిస్తాడో ఈ నటసింహానికి కూడా తెలీదు. తన ప్రసంగాల్లో నోరుజారిన సందర్భాలు చాలా ఉన్నాయి. తమ మాటల తూటాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

https://www.youtube.com/watch?v=I_Y-6FlkH8I

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -