Thursday, March 28, 2024
- Advertisement -

క‌ర్నూలు స్థానిక‌ సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌పై జిల్లా టీడీపీ నేత‌ల‌తో చంద్ర‌బాబు భేటీ…

- Advertisement -

క‌ర్నూలు జిల్లా మ‌రో సారి ఎన్నిక స‌మ‌రానికి సిద్ద‌మ‌వుతోంది. టీడీపీ త‌రుపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. రాజీనామాతో ఖాలీ అయిన స్థానికి సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. ఎమ్మెల్సీ స్థ‌నాన్ని కైవ‌సం చేసుకొనేందుకు టీడీపీ, వైసీపీలు ముమ్మ‌ర క‌స‌ర‌త్తు ప్రారంభించాయి.

ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించేందుకు క‌ర్నూలు జిల్లా నేత‌ల‌తో చంద్ర‌బాబు స‌మావేశ మ‌య్యారు. ఈస‌మావేశానికి ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు. అధికారికంగా ఆమె టీడీపీ కండువా క‌ప్పుకోక‌పోయినా టీడీపీలో చేరిన‌ట్లేలెక్క‌.

క‌ర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు. టీడీపీ త‌రుపున పోటీ చేసేందుకు అనేక‌మంది రేసులో ఉన్నారు. కేఈ ప్రభాకర్ రెడ్డి, శివానంద రెడ్డి, శ్రీధర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మాండ్ర శివానంద తదితరులు ఉన్నారు. త‌మ‌కు అనుకూలంగా ఉన్న నేత‌ల‌తో వరికి వారే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే స‌మావేశంలో బీసీ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని కేఈ వర్గం కోరుతోంది. తంలో రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమిచ్చినందున, ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధానంగా కేఈ ప్రభాకర్, చల్లా రామకృష్ణా రెడ్డిల మధ్య పోటీ ఉందని చెబుతున్నారు. త్వ‌ర‌లో టికెట్టు ఎవ‌రికి ద‌క్కుతుందో తేల‌నుంది.

వైసీపీలోను హైటెన్షన్ వైసీపీలోను అభ్యర్థి ఎంపికపై హైటెన్షన్ నెలకొంది. శిల్పా సోదరులు ప్రధానంగా 2019 అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ పైన గురి పెట్టారని తెలుస్తోంది. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన గౌరు వెంకట రెడ్డిని మరోసారి నిలబెట్టవచ్చునని అంటున్నారు. నాడు టిడిపి నుంచి పోటీ చేసిన శిల్పా చక్రపాణిపై వైసీపీ అభ్యర్థిగా గౌరు 62 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓడారు. ఇప్పుడు గౌరును నిలబెడితే శిల్పా మద్దతుతో వైసీపీ గెలుస్తుందని అంటున్నారు.

అయితే ఇక్క‌డ‌నే బాబు భ‌యం వెంటాడుతోంది. టీడీపీకి క్రాస్ ఓటింగ్ ఫీవర్ ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరగకుండా చూడటం, సీటును కాపాడుకోవడం తెలుగుదేశం పార్టీకి సవాల్‌గా మారిందని అంటున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మెజార్టీ బలం ఉన్నప్పటికీ టీడీపీని క్రాస్ ఓటింగ్ ఫీవర్ వెంటాడుతోందని అంటున్నారు. అభ్యర్థి ఎంపికను బట్టి క్రాస్ ఓటింగ్ ప్రభావం ఉంటుందని అంటున్నారు. వైసీపీ కూడా క్రాస్ ఓటింగ్‌పై దృష్టి సారించింది. అభ్య‌ర్తుల ఎంపిక త‌ర్వాత స‌మీక‌ర‌ణాలు మారొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -