Monday, April 29, 2024
- Advertisement -

జబర్దస్త్ ఆనంద్‌ భార్యకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రోజా.. ఏ విషయంలో అంటే?

- Advertisement -

బుల్లి తెర కామెడీ షో జబర్దస్త్ కోట్లాది ప్రజల హృదయాల తాకి వారి ఆదరణ పొందుతోంది.
అలాగే ఈ షో ద్వారా ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. చాలా మంది నటులను జబర్దస్త్ ఆదరించింది,వారిలోని నటనను వెలికితీసింది. అలాంటి వారిలో కమెడియన్ ఆనంద్ ఒకరు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని జబర్దస్త్ వేదికపైకి వచ్చిన ఆనంద్.తనదైన కామెడీ పంచులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

జబర్దస్త్ ప్రోగ్రాంలో మొదట ఆనంద్ చమ్మక్ చంద్ర గ్రూప్‌లో చేరి చిన్న చిన్న పాత్రల్లో మెప్పిస్తూ తన అద్భుత ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. ఆనంద్ జబర్దస్త్ వేదికపై రాణిస్తూనే, ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ‘సరదాగా కాసేపు మా ఫ్యామిలీతో ‘ అంటూ తన ఫ్యామిలీని పరిచయం చేస్తూ, ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెరిగి ఆ తర్వాత ఒకరినొకరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని,తన భార్య వాళ్లది అనంతపురం అని, వాళ్ళింట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపాడు. తాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు సపోర్ట్ గా జబర్దస్త్ జడ్జ్ రోజా, చమ్మక్ చంద్ర ఉన్నారని ఈ సందర్భంగా తెలిపాడు.

Also read:ఆ సీక్రెట్ ఏంటని మహేష్ కాల్ చేసి మరి అడిగాడు: సుధీర్ బాబు

మొదటిసారి కమెడియన్ ఆనంద్ భార్యను సోషల్ మీడియాలో చూసిన నెటిజెన్స్ ప్రశంశల వర్షం కురిపిస్తూ,మీ భార్య హీరోయిన్స్ కంటే అందంగా ఉందంటూ మెచ్చుకున్నారు. అలాగే మీ ఇద్దరు కొడుకులు చాలా క్యూట్‌గా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

Also read:అత్తారింట్లో మెగా డాటర్ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -