Friday, May 10, 2024
- Advertisement -

ఆ సీక్రెట్ ఏంటని మహేష్ కాల్ చేసి మరి అడిగాడు: సుధీర్ బాబు

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తు టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సుధీర్ ఇండస్ట్రీలో “ప్రేమ కథా చిత్రం” తో సూపర్ హిట్ అందుకొని ‘భలే మంచి రోజు’, ‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘సమ్మోహనం’, ‘నన్ను దోచుకుందువటే’ వంటి విభిన్న చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ “శ్రీదేవి సోడా సెంటర్” నుంచి రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ గింప్స్ లో సిక్స్ పాక్ బాడీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలోతన సిక్స్ ప్యాక్ బాడీ గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.తన ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటని చాలామంది హీరోలు అడుగుతుంటారని,తాను చేసిన సినిమాలు నచ్చితే ప్రిన్స్ మహేష్ బాబు వెంటనే కాల్ చేసి అభినందిస్తారని, కృష్ణగారు మాత్రం చిన్న స్మైల్ ఇస్తారని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Also read:నేను ప్రజలకు సేవ చెయ్యడం ఒక కల.. ఆర్జీవీ!

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న”శ్రీదెవీ సోడా సెంటర్”మూవీ లో సుధీర్ బాబు లైటింగ్ మెన్ సూరిబాబు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ప‌లాస’ సినిమాతో వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న క‌రుణ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే లైటింగ్ ఆఫ్ సూరిబాబు పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

Also read:సుల్తాన్ సినిమాలో ఈ రొమాంటిక్ సీన్ ను చూశారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -