Friday, May 17, 2024
- Advertisement -

జబర్దస్త్ ధన్ రాజ్.. ఏమిటీ అసహ్యకరమైన చేష్టలు…!

- Advertisement -

కామెడియన్ గా ప్రతిభావంతుడనే పేరును సంపాదించుకున్నాడు.. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకున్నాడు..

ఇక చిన్న చిన్న సినిమాల్లో హీరోగా చేసుకొంటూ అలా బండి లాగిస్తున్నాడు ధన్ రాజ్. మరి అలా ముందుకు వెళుతున్న అతడి తాజా చేష్టలు మాత్రం వికారంగా ఉన్నాయి. అతడు హీరోగా నటించిన ఒక సినిమాకు సంబంధించిన పోస్టర్ అసహ్యంగా ఉంది. 

ఇంటర్నెట్ లోకి వదిలిన ఆ పోస్టర్ పరమ లేకిగా.. చీప్ గా ఉంది. ఇలాంటి పోస్టర్లు విడుదల చేయడం ఏమిటి? అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఏమిటీ పైత్యం అంటున్నారు.

ధన్ రాజ్ హీరోగా ‘పనిలేని పులిరాజు’ అనే సినిమా ఒకటి రూపొందినట్టుగా ఉంది. ఆ సినిమాకు సంబంధించి తాజాగా ఒక పోస్టర్ విడుదల అయ్యింది. ఆ పోస్టర్ ఎంత అసహ్యంగా ఉందో వర్ణించి చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేయడమే. ఇప్పుడిప్పుడే కాస్తంత పేరు సంపాదించుకుంటున్న ధన్ రాజ్ ఇలాంటి చేష్టలతో చాలా మందికి దూరం అయ్యే ప్రమాదం ఉంది.

 ఇప్పటికే జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్ లు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. మరి సినిమాలకు కూడా అలాంటి అసహ్యపు పోకడలు పాకేలా చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇదైతే అంత మంచిది కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -