Saturday, May 4, 2024
- Advertisement -

అమ్మాయి ఫోటో చూసి అబ్బాయిలు జాతకం చెప్పేస్తారు

- Advertisement -

అమ్మాయి ని చూస్తే అబ్బాయి, అబ్బాయి ని చూస్తే అమ్మాయి వారు ఎలాంటి వారో, వారి మనస్తత్వం ఎలాంటిదో చాలా తేలికగా చెప్పేస్తూ ఉంటారు కుర్రకారు.

టెక్నాలజీ డవలప్ అయినట్టు బుర్రలు కూడా డెవలప్ అయినట్టు ఉన్నాయి, అమ్మాయి దాకా అక్కరలేదు ఆమె ఫోటో చూపిస్తే ఎలాంటిదో చెప్పేసే సత్తా మగాళ్ళకి ఉంది అంటున్నారు పశ్చిమ ఆస్ట్రేలియా యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు. 

అమ్మాయి ఫోటో చూసిన వెంటనే ఆమె ఎలాంటిది, ఆమెని నమ్మచ్చా? మొదటి నుంచీ ఆమె నమ్మకస్తురాలా కాదా ? అనే విషయాలు చెప్పెయ్యగల సామర్ధ్యం అబ్బాయిల సొంత అంటున్నారు. 

ఈ పరిశోధన కోసం పురుషులని రెండు భాగాలుగా విభజించి కొందరికి అమ్మాయిల ఫోటోలు చూపించారు. రెండు భాగాల లోని కుర్రాళ్ళూ ఒకే లాంటి సమాధానాలు చెప్పారు. అంతకు ముందే ఆ అమ్మాయిల నడవడిక గురించి తెలుసుకున్న ప్రొఫెసర్ లు వారు అలాంటి సమాధానాలే చెప్పడం తో ఒకింత ఆశ్చర్యపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -