- Advertisement -

ట్వీట్ల అమ్మకం… సినిమా వాళ్ల కొత్త బిజినెస్!

- Advertisement -

తమకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో సినిమా వాళ్లు చాలా తెలివి మీరిపోయారు.

పేరున్న హీరోలు, హీరోయిన్లు వివిధ బ్రాండ్లకు, వివిధ ఉత్పత్తులకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదించుకొంటుండగా… వాళ్లే ఇప్పుడు మరో మార్గాన్ని కనుక్కొన్నట్టుగా ఉన్నారు. అదే ట్వీట్ల బిజినెస్. ట్విటర్ లో లక్షల సంఖ్యలో ఫాలోయర్లను కలిగి ఉన్న సినిమా తారలు…వివిధ బ్రాండ్లను ట్విటర్ ద్వారా ప్రమోట్ చేస్తూ వారు సొమ్ము చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

ఒక్క బ్రాండ్ నో.. ఒక హోటల్ నో ప్రమోట్ చేస్తూ పెట్టే ట్వీట్ కు గరిష్టంగా పది లక్షల రూపాయల వరకూ ముడుతోందటన ఈ సినిమా స్టార్లకు. తాము ఆ బ్రాండ్ ప్రోడక్ట్ ను వాడటం ద్వారా కంఫర్ట్ గా బతుకుతున్నామనో… లేక ఫలానా హోటల్ లో భోజనం బాగుంటుందనో ట్వీట్ పెడితే చాలు. .వీళ్ల అకౌంట్లలోకి డబ్బులు వచ్చి పడుతున్నాయి. ఎలాగూ ఈ సినిమా వాళ్లకు ఫాలోయర్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో ఆ బ్రాండ్ల ప్రమోషన్ కూడా వాళ్లందరికీ చేరుతోంది. దీంతో  కంపెనీలు, సంస్థలు కూడా ట్వీట్లకు భారీ స్థాయిలో డబ్బు ముట్టచెప్పడానికి సిద్ధం అవుతున్నాయి.

ఇదీ సినిమా తారల కొత్త బిజినెస్. ఇప్పటికే సినిమాల ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తూ… ఎండార్సమెంట్ వెల్లువలో వచ్చి పడుతున్న డబ్బులో తడుస్తున్న వాళ్లు.. ఇలా ట్విటర్ ద్వారానూ, ఫేస్ బుక్ ద్వారా కూడా సంపాదించడం ఆసక్తికరమే! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -