టాలీవుడ్ వివాస్పద నటుడు రామ్ గోపాల్ వర్మ హిట్ కొట్టి చాలాకాలం అయింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఇటీవలే తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జనాలు ఈ సినిమా నుంచి బయటికి రాకముందే మరో క్రేజీ బయోపిక్‌ను అనౌన్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాన్ని వెండితెర మీద చూపించబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ.
రెండు రోజులు క్రితమే ఈ బయోపిక్‌కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా టైటిల్‌ను ‘టైగర్ కేసీఆర్’గా కూడా అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను కూడా రెడీ చేశాడు. తాజాగా ఈ బయోపిక్‌లో నటించే నటుల ఎంపిక పనిలో బిజీగా ఉన్నాడు వర్మ. ఈ బయోపిక్‌లో కేసీఆర్ పాత్ర కోసం జబర్థస్త్ నటుడిని ఎంపిక చేసుకుని అందరికి షాకిచ్చాడు రామ్ గోపాల్ వర్మ.
ఈ సినిమాలో కేసిఆర్ పాత్రని పోషించడానికి ప్రముఖ టీవీ షో జబర్దస్త్ లో నటించే మహేష్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. జబర్దస్త్ షో ద్వారా మహేష్ బాగా పాపులర్ అయ్యాడు. దీంతో సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు.రంగస్థలం, మహానటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేశ్. కేసిఆర్ పాత్రలో జబర్దస్త్ మహేష్ ఎలా నటిస్తాడో చూడాల్సి ఉంది.
- Advertisement -
కేసీఆర్ పాత్రలో జబర్దస్త్ నటుడుని తీసుకున్న రామ్ గోపాల్ వర్మ
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -