- Advertisement -

లైంగిక ఆరోప‌ణ‌ల‌పై సుప్రీంకోర్టు చీఫ్ రంజన్ గొగోయ్ చంల‌న వ్యాఖ్య‌లు..

- Advertisement -

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరోప‌న‌లు రావ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మీదె రావ‌డం అస‌క్తిక‌రంగా మారింది. జస్టిస​ రంజన్‌ గోగొయ్‌ గతంలో తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేశారు.

సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలు చేశారు. 2018 అక్టోబ‌ర్ 10 లేదా 11వ తేదీన చీఫ్ జ‌స్టిస్ ఆ మ‌హిళ‌పై లైంగిక దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సీజే త‌నను హ‌త్తు కున్నార‌ని, త‌న న‌డుమును గ‌ట్టిగా ప‌ట్టుకున్నార‌ని, త‌న శ‌రీరాన్ని చేతుల‌తో అంత‌టా ట‌చ్ చేశార‌ని, అత‌ని శ‌రీరంతో త‌న శ‌రీరాన్ని గ‌ట్టిగా ప్రెస్ చేశార‌ని మాజీ ఉద్యోగి త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయ‌న లైంగిక వేధింపుల‌ను తిర‌స్క‌రించాన‌న్న కార‌ణ‌తో తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారని, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ త‌ర్వాత ఢిల్లీ పోలీసు శాఖ‌లో ప‌నిచేసే భ‌ర్త‌, సోద‌రుల‌ను కూడా అన్యాయంగా తొల‌గించార‌న్నార‌ని ఆమె తెలిపింది. కోర్టులో గ్రూపు డి ఉద్యోగం చేసే త‌న భ‌ర్త సోద‌రుడిని కూడా తొల‌గించార‌ని పేర్కొన్న‌ది. త‌న‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల ప‌ట్ల మాజీ సీనియ‌ర్ జడ్జిల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆమె డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం, ఏప్రిల్‌20న) సిజేఐ జస్టిస్ రంజన్‌ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

అయితే ఈ లైంగిక ఆరోప‌న‌ల‌ను రంజన్ గొగోయ్ కొట్టి పారేశారు. త‌న‌ను తొల‌గించేందుకు కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌తి ఉద్యోగిని స‌మానంగా, గౌర‌వంగా చూసిన‌ట్లు తెలిపారు. ఆ ఉద్యోగిని త‌న దగ్గ‌ర కేవ‌లం నెలన్న‌ర రోజులు మాత్ర‌మే ప‌నిచేసింద‌న్నారు. వ‌చ్చే వారం కీల‌క కేసులు ఉన్నాయ‌ని, వాటి నుంచి దృష్టి మ‌ళ్లించేందుకు ఈ ఆరోప‌ణ‌లు చేశార‌ని సీజేఐ ఇవాళ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -