Monday, April 29, 2024
- Advertisement -

రాహుల్‌, పాండ్యాల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ అంబుడ్స్ మ‌న్‌..

- Advertisement -

కాఫి విత్ క‌ర‌ణ్ కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రాహుల్‌, హార్థిక్ పాండ్యాల‌పై దేశ వ్యాప్తంగా వారిమీద తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వారి వ్యాఖ్య‌ల‌పై విచార‌ణ జ‌రిపిన బీసీసీఐ అంబుడ్స్‌మ‌న్ డీఎకే జైన్ జరిమానా విధించారు. ఆ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌కు ఒక్కొక్క‌రికి 20 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ప‌ది మంది పారామిలిట‌రీ కానిస్టేబుళ్ల భార్య‌ల‌కు చెరొక‌రు ఒక్కొక్క ల‌క్ష చొప్పున ఇవ్వాల‌ని అంబుడ్స్‌మ‌న్ ఆదేశించారు.

మిగిలిన ప‌ది ల‌క్ష‌ల‌ను అంథుల క్రికెట్ పురోభివృద్ది కోసం డొనేట్ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు నియమించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ వారిద్దరూ నాలుగు వారాల్లో తాము విధించిన జరిమానాను కట్టకపోతే వారి మ్యాచ్ ఫీజులో నుంచి కోత విధించి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

ఆస్ట్రేలియా టూర్ నుంచి అర్ధాంత‌రంగా వెన‌క్కి పంప‌డం వ‌ల్ల ఇద్ద‌రు ప్లేయ‌ర్లు సుమారు 30 ల‌క్ష‌ల ఆదాయాన్ని కోల్పోయిన‌ట్లు అంబుడ్స్‌మ‌న్ తెలిపారు.దేశంలో క్రికెటర్లను చాలా మంది రోల్ మొడల్‌గా తీసుకుంటారని, అలాంటి వారు నోరుజారడం మంచిది కాదని హితవు పలికింది. బీసీసీఐ ఆటగాళ్లకు విధించిన నియమ నిబంధనలను వారు ఉల్లంఘించారని అంబుడ్స్‌మన్ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -