Friday, May 17, 2024
- Advertisement -

జబర్దస్త్ న‌టుడు అరెస్ట్

- Advertisement -

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ న‌టుడిని అరెస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.పూర్తి వివ‌రాల‌లోకి వెళ్తే…తిరుపతికి చెందిన హరిబాబు నటన మీద ఆసక్తితో వ‌చ్చి ప‌లు టీవీ షోల‌లో ఆర్టిస్ట్‌గా ప‌నిచేస్తున్నాడు.దీంతో అత‌నికి ఈ టీవీలో ప్ర‌సార‌మైయ్యే జబర్దస్త్‌లో అవ‌కాశం వ‌చ్చింది.డ‌బ్బు మీద మోజుతో అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని తాను కూడా స్మగర్‌గా మారాడు.

విద్యార్థులు, నిరుద్యోగులకు డబ్బును ఎరగా వేసి వారి సాయంతో ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటించేవాడు.స్మగ్లింగ్‌లో కోట్లు సంపాదించి ఆ డబ్బును సినిమాల్లో పెట్టుబడిగా పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. 2012 నుంచి ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో అతనిపై 10 స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి.ఇతని ఆచూకీ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. ఎట్టకేలకు అతనిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు నటులకు కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -