Tuesday, May 14, 2024
- Advertisement -

మేకప్‌మెన్‌‌కు కారు కానుకిచ్చిన జాక్వెలిన్‌

- Advertisement -

బాలీవుడ్ న‌టులు ఎలా వివాదాల‌లో ఉంటారో, మంచి విష‌య‌ల‌లో కూడా అదేవిధాంగా ముందు వ‌రుస‌లో ఉంటారు.ఆ వ‌రుస‌లోకే వ‌స్తారు బాలీవుడ్‌ కథానాయిక జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.తన మంచి మనసును మ‌రోసారి చాటుకున్నారు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.తన మేకప్‌మెన్‌ షాన్‌ ముత్తాతిల్‌కు ఖరీదైన కారును కానుకగా ఇచ్చారు. షాన్‌ గత కొన్నేళ్లుగా జాక్వెలిన్‌ వద్ద పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఖరీదైన కారును కానుకగా ఇచ్చి, సర్‌ప్రైజ్‌ చేశారు.ఈ విషయాన్ని షాన్‌ సోషల్‌మీడియా వేదికగా తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

‘శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు. జాక్వెలిన్‌ మీరు నిజంగా నన్ను సర్‌ప్రైజ్‌ చేశారు. జాక్వెలిన్‌ గత ఏడాది ‘జుడ్వా 2’తో మంచి హిట్‌ అందుకున్నారు. ఇటీవల విడుదలైన ‘బాఘి 2’ సినిమాలోని ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేశారు. ప్రస్తుతం సల్మాన్‌ ‘రేస్‌ 3’ కథానాయికగా నటిస్తున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -