శ్రీరెడ్డిపై కేసు న‌మోదు చేసిన శివ బాలాజీ

టాలీవుడ్ న‌టి శ్రీరెడ్డిపై న‌టుడు శివ బాలాజీ కేసు న‌మోదు చేశారు.పవన్ కళ్యణ్ కు ఉన్న చాలా మంది అభిమానుల్లో శివబాలాజి ఒకడు. రెండు రోజుల క్రితం శ్రీరెడ్డి వ్యాఖ్యలకు యావత్ టాలీవుడ్ మొత్తం ఏకమై శ్రీరెడ్డి మాటలను వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి మాటలను ఖండిస్తు…హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆమె పై పిర్యాదు చేశాడు. ఎలాగైన శ్రీరెడ్డి పై యాక్షన్ తీసుకోవాలని కోరినట్లు సమాచారం. యాక్షన్ తీసుకుంటే 5 ఏళ్లు శిక్షపడే అవకాశం ఉందన్న శివబాలాజి లాయర్.మొద‌ట ప‌వ‌న్‌ను అన్న పిలిచిన శ్రీరెడ్డి త‌రువాత తీవ్ర ప‌ద‌జాలంతో దూషించింది.ప‌వ‌న్ వాళ్ల అమ్మను కూడా తిట్టేస‌రికి అప్ప‌టి వ‌ర‌కు స‌పోర్టు చేసిన వారంద‌రు ఆమెకు దూరం అయ్యారు.

శ్రీరెడ్డికి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయారు.దీంతో దిగివ‌చ్చిన శ్రీరెడ్డి త‌ను త‌ప్పు చేశాన‌ని …క్ష‌మాప‌ణ‌లు కొరుతున్నాని ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసింది. దీంతో సంతృప్తి చెంద‌ని అభిమానులు బ‌హిరంగంగా ఆమె ప‌వ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు న‌టుడు శివ‌ బాలాజీ పోలీస్ స్టేషన్ లో ఆమె పై పిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.ఇది నిజ‌మ‌ని నిర్ధార‌ణ అయితే శ్రీరెడ్డికి జైలు శిక్ష త‌ప్ప‌దు.

 

Related Articles

Most Populer

Recent Posts