Thursday, May 9, 2024
- Advertisement -

పవన్ ‘ హరి హర వీరమల్లు’ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’తో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ తెలుగు ప్రేక్షకుల పరిచయం అయ్యింది. ఈ శ్రీలంక బ్యూటీ ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ మాత్రం సాధించలేదు. తాజాగా హాట్ బ్యూటీ జాక్వలిన్ పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో కనిపించేందుకు రెడీ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రియేటివ్ దర్శకుడు క్రిష్, సంచలన నిర్మాత ఏ.ఎమ్. రత్నం కాంబినేషన్‌లో రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ కథ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో నడుస్తుంది.

బందిపోటు పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఇప్పటికే పవన్ లుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఒక కథనాయికగా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రను జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పోషిస్తోంది. మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రాణి పాత్రలో జాక్వెలిన్ కనిపించనుందని చెబుతున్నారు. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్‌ కరోనాకు గురికావడంతో ఈ చిత్రంతో పాటు, ఆయన చేస్తోన్న మరో చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ షూటింగ్‌కి కూడా బ్రేక్ పడింది.

తాజాగా జాక్వలిన్ తన ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్‌లో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రం చేస్తున్నాను. ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు వెయిట్ చేస్తున్నాను. షూటింగ్స్ సజావుగా సాగి, దర్శకుడు ఎప్పుడంటే అప్పుడు ఆ చిత్ర షూట్‌లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నా అంటుంది జాక్వెలిన్. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ సినిమా షూటింగు తిరిగి మొదలవుతుందని చెబుతున్నారు. పవన్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది.

నేటి పంచాంగం, ఆదివారం (16-05-2021)

ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

బీ అలర్ట్.. ముంచుకొస్తున్న ‘తౌతే ‘ తుఫాను…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -