Wednesday, April 24, 2024
- Advertisement -

బీ అలర్ట్.. ముంచుకొస్తున్న ‘తౌతే ‘ తుఫాను…

- Advertisement -

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్టే ‘ తుపాను మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా బలపడనుంది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ వెల్లడించింది. అంతే కాదు ‘తౌక్టే ‘ ప్రభావం ఏపీపైనా పాక్షికంగా ఉండనుందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది.

రాష్ట్రంలో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. ఈ తుఫాన్ మంగళవారం గుజరాత్ తీరాన్ని తాకే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం మధ్యాహ్నం గుజరాత్ లోని పోరుబందర్, నలియాను తౌక్టే దాటే అవకాశం ఉందని తెలిసింది. గుజరాత్ తోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ర్టలకు ఈ తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

ఈ తుఫాన్ ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతం లక్ష ద్వీప్‌పై తుఫాన్ ప్రభావం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ శాఖ వెల్లడించింది. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్,ఆరెంజ్ అలర్ట్‌లను ప్రకటించారు.

భద్రతా దళాలు కాల్పుల్లో నటికీ తీవ్ర గాయాలు..?

టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి : మంత్రి ఆదిమూలపు సురేశ్

మమతా బెనర్జీ ఇంట విషాదం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -