జగపతి బాబు అంటే ఠక్కున గర్తుకు వచ్చేది ఫ్యామిలీ సినిమాలు.ఇదింతా ఒక్కప్పుడు కాని ఇప్పుడు జగపతి బాబు అంటే విలన్,క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు.తాజాగా ఆయన బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జగపతి బాబు ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు.సాక్ష్యం సినిమాలో చేసిన పాత్ర చూస్తే జనాలు తనను కొడతారని అంటున్నాడు. తనంత నీచుడు ఎవడూ లేడని సినిమా చూశాక అనిపించిదన్నాడు.
‘సాక్ష్యంలో విలనిజం నాకు బాగా నచ్చింది. లోకంలో ఇంతకంటే నీచుడు ఉండడు. ఇప్పటివరకూ నా పాత్రల్ని ప్రేక్షకులు క్షమిస్తూ భరించారు. కానీ ఈసారి కష్టం. ఇందులో విలన్ అంత ఎధవ’ అంటూ జగపతిబాబు పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. ఇలాంటి పాత్రలు చేస్తే తన మీద తనకే భయం వేస్తోందని అన్నాడు. రొటీన్ లైఫ్ లో కూడా తను ఇలా మారిపోతానేమో అన్న భయాన్ని బయటపెట్టాడు. ఒకప్పుడు హీరోగా నటించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ రోల్స్ కూడా మెప్పించడం గ్రేట్ అంటున్నారు ఆయన అభిమానులు.