Tuesday, April 23, 2024
- Advertisement -

జగపతి బాబూ.. వర్కవుట్ అవుతుందా!

- Advertisement -

డబ్బుల అవసరం వస్తే.. ఎంతటి వారైనా.. ఎలాంటి దారిలో అయినా వెళ్లాల్సిందే. అందుకు.. టాలీవుడ్ లో కొత్త విలనీ పండిస్తున్న జగపతిబాబు కూడా ఏమంత తీసిపోలేదు. ఇదంతా ఎందుకంటారా? అయితే.. జగపతి చేస్తున్న కొత్త ప్రయత్నం మీరు తెలుసుకోవాల్సిందే.

ఇండస్ట్రీలో చాలా మంది.. చాలా రకాల అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కొందరు పరిచయాలతో ముందుకు రాగలిగితే.. ఇంకొందరు స్వయం శక్తితో ఎదిగిన వాళ్లుంటారు. కొందరికి అదృష్టం కలిసొస్తే.. అమాంతం ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. కానీ.. చాలా మంది మాత్రం ప్రతిభ ఉన్నా.. అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు.

అలాంటి వారి అవసరాన్నే.. ప్రమోట్ చేసేలా.. పనిలో పనిగా తనూ కొంత డబ్బు వెనకేసుకునేలా జగపతిబాబు ప్లాన్ చేశాడు. క్లిక్ సినీ కార్ట్ పేరుతో.. ఓ వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి.. సినిమాల్లోకి రావాలనుకునే వాళ్ల ప్రొఫైల్స్, వాళ్లు ఎందులో నిపుణులు అన్న విషయాలు అందుబాటులో పెట్టే ఆలోచన చేస్తున్నాడు. అయితే.. ఇప్పటికే చాలా మంది సోషల్ సైట్లను వాడుకుంటూ.. తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో.. జగపతి ప్రయత్నం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -