Saturday, May 18, 2024
- Advertisement -

పవన్.. ఎందుకంత కష్టం?

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టం మాటల్లో చెప్పలేకుండా ఉంది. సర్దార్ ను గట్టెక్కించేందుకు.. టైటిల్ కార్డ్స్ నుంచి.. ఎండ్ కార్డ్ వరకూ అన్నీ తానై వ్యవహరిస్తున్న పవర్ స్టార్.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లోనూ అంతే శ్రద్ధ చూపిస్తున్నారట.

ఫైనల్ వర్క్ లో ఉన్న సినిమా ప్రోగ్రెస్ ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిన్న పూర్తిగా ఈ సినిమా పని పైనే… ప్రసాద్స్ లాబ్స్ లో పవన్ ఉండిపోయారని.. తిండి, నిద్ర లాంటివి పట్టించుకోకుండా పని చేస్తున్నారని చెబుతున్నారు. కారులోనే కాసేపు పడుకుని.. మళ్లీ పనిపై దృష్టి పెట్టాడని అంటున్నారు.

టీజర్ తో పాటు.. ఆడియో విడుదల తర్వాత.. పవన్ లో కాస్త కంగారు పెరిగినందునే… ఇంతలా శ్రద్ధ తీసుకుంటున్నాడని కొందరు అనుమానిస్తున్నారు. అందుకే.. అడుగడుగూ తన కనుసన్నల్లోనే సర్దార్ ను పవన్ ఫైనల్ చేస్తున్నాడని.. దర్శకుడు బాబీ.. ఈ విషయంలో డమ్మీ అయిపోతున్నారని చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతో.. అబద్ధం ఎంతో.. పవన్, బాబీలకే ఎరుక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -