Friday, May 17, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫేస్ లో కొత్త కళ వచ్చిందే..

- Advertisement -

ఎన్టీఆర్ ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు.రెగ్యులర్ గా చేసే సినిమాలా జై లవకుశను చేసినప్పటికీ… అది అనుకోకుండా…బిగ్ బాస్ మాదిరిగా సూపర్ హిట్ అయిపోవడం ఇప్పటికీ తారక్ నమ్మలేకపోతున్నాడు. బిగ్ బాస్ రియాల్టీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన తారక్ జై లవకుశ ఓపెనింగ్ విషయంలో మంచి ఫలితాన్నే రాబట్టాడు. దానిలో భాగంగానే ఎన్టీఆర్… జై లవకుశతో గ్రాస్ పరంగా వందకోట్లను దాటేశాడు.

కేవలం రెండు వారాల్లో ఈ చిత్రం ఈ స్థాయి వసూల్లను రాబడుతుందని యూనిట్ ఎవ్వరూ ఊహించలేదు. 125కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన ఈ సినిమా ఏపీ-తెలంగాణ నుంచి 54.48 కోట్ల షేర్ రాబట్టడం… 12 కోజుల్లో వరల్డ్ వైడ్ గా 72 కోట్ల షేర్ ను సాధించడం అటు బాలయ్య అభిమానులు కూడా నమ్మలేకపోతున్నారు.

రీసెంట్ గా తారక్ ను కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర తన సినిమా కలెక్షన్ల గురించే అదే పనిగా ప్రస్తావిస్తూ ఉండడంతో ఈ సినిమా లెక్క తారక్ ఫేస్ లో ఎలాంటి మెరుపును తెచ్చిందో స్వయంగా చూస్తున్నారు. ఫేస్ లో కొత్త కళతో ఉన్న తారక్ మాంచి ఊపు మీదుండి… తన తర్వాత చిత్రాల బడ్జెట్ ను పెంచుకోవచ్చనే ధీమాతో ఉన్నాడు. అలాగనే కాకుండా తన నిర్మాతలను నమ్మించేలా జై లవకుశతో అభయమిచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -