Sunday, April 28, 2024
- Advertisement -

భరత్ అను నేను ఫస్ట్ లుక్ చూశారా..?

- Advertisement -

స్పైడర్ సినిమా తర్వాత మహేష్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. మహేష్ ఇటలీ టూర్ వెళ్లినా కూడా.. ఇక్కడ బ్యాకెండ్ లో ఆయన టీమ్ యాక్టివ్ గా పనిచేస్తోం. స్పైడర్ ఇంకా ధియేటర్లలో ఉండగానే ”భరత్ అను నేను” సినిమా గురించి డిస్కషన్లు.. ప్రచారం మొదలెట్టేవారు.

ఈ సినిమాలో మహేష్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. అదిగో ఆ లుక్ లో ఎలా ఉంటాడో ఇప్పుడు చెప్పకనే చెప్పేశారు. ఫార్మల్ డ్రస్సులో మహేష్ చూడ్డానికి రొటీన్ గానే ఉన్నాడు కాని.. కాకపోతే చుట్టూ సెక్యూరిటీ వెనకాల సెక్రటరీని చూస్తే మాత్రం.. ఓవరాల్ సెటప్ అంతా ఎక్సయిటింగ్ గా ఉంది. గతంలో రానా దగ్గుబాటి కూడా లీడర్లో ఇదే తరహాలో కనిపించాడని ఓమారు గుర్తురాకుండా ఉండదులే కాని.. చీఫ్ మినిష్టర్ కు అంతకంటే పెద్ద ఆప్షన్లు ఉండవు మరి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ డిలే కావడంలేదని ఈ సినిమా యునిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే అనుకున్నట్లు సినిమా సంక్రాంతికే వస్తుందా లేదంటే సమ్మర్ కు వాయిదా పడుతుందా అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -