Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్ చేతికి రక్తపు మరకలు!

- Advertisement -

ప్రభాస్ కు గాయం ఎందుకు అయ్యిందని అలోచిస్తున్నారా..? అసలు విషయం వేరే ఉంది. నిన్న బాహుబలి 2 సినిమాకి సంబందించి క్లైమాక్స్‌ షూటింగ్ ను మొదలు పెట్టారు. చాలా రోజులుగా ఈ క్లైమాక్స్ ను షూట్ చేయాలి అని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అయితే నిన్నంతా భారీ యుద్ధ సన్నీవేశాలు చిత్రికరించారు.

మొదటి రోజు సక్సెస్ ఫుల్ గా షూటింగ్ ముగిసేసరికి యుద్ధ  సన్నివేశంలో ప్రభాస్ చెయ్యి ముందుకు అభివాదం చేస్తున్నట్లు ఉన్న ఫోటోని ట్వీటర్ ద్వారా ఫోస్ట్ చేసారు. ఈ ఫోటో చూస్తే ప్రభాస్ చేతికి రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. సో బాహుబలి యుద్దంలో పోరాడినట్లున్న తెలుస్తోంది. చేతికి ముందు బాహుబలి 2 కి సంబంధించిన యూనిట్ సభ్యులందరు కనిపిస్తున్నారు. మొదటి రోజే చాలా బాగా షూటింగ్ జరిగిందని యూనిట్ సభ్యులందరు అంటున్నారు. అలాగే రాజమౌళి ప్లానింగ్ వల్లే ఇలా జరిగిందని రాజమౌళిని అందరు మొచ్చుకున్నారు.

సో మొత్తానికి మొదటి రోజు ప్రశాంతంగా జరిగిందని చెబుతూ.. ‘జై మాహిష్మతి’ అన్నారు. బాహుబలి 2 కోసం ప్రభాస్ చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ క్లైమాక్స్ షూటింగ్ కోసం హాలీవుడ్ నుంచి నిపుణులను తీసుకోచ్చారట. సో బాహుబలి 2 చాలా అద్భుతం గా రెడి అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా 2017 ఏప్రిల్ 18న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -