Sunday, April 28, 2024
- Advertisement -

అవ‌తార్ 2 రిలీజ్ డేట్ మారింది… ఎప్పుడంటె

- Advertisement -

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ 2009లో తెరెక్కించిన అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బ్లాస్ట‌ర్ విజయం సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల సునామీ సృష్టించింది. సహజవనరుల కోసం మనుషులు పాండోరా గ్రహానికి వెళ్లడం, అక్కడ నావీ అనే జాతికి చెందిన జీవులతో యుద్ధం, వారికి హీరో సాయం చేయడం వంటి ఆసక్తికరమైన మలుపుతో సినిమాను కామెరూన్ అద్భుతంగా తీర్చిదిద్దారు.

అయితే అవ‌తార్ 2కు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అవతార్ సీరీస్ లో మొత్తం ఐదు సినిమాలు నిర్మిస్తున్న‌ట్లు అప్పట్లోనే కామెరూన్ ప్రకటించారు . ఐదు సీరీస్ లలో మొదటి సినిమా 2009 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టైంది. అవ‌తార్ 2 సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు జేమ్స్ కామెరూన్‌.

ఈ సీరీస్ లో రెండో సినిమాను డిసెంబర్ 2020లో రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి 2021 డిసెంబర్ 17 వ తేదీన రిలీజ్ చేస్తామ‌ని కి వాయిదా వేశారు కామెరూన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటించారు.

ఈ సీరీస్ లో వచ్చే అవతార్ 3 డిసెంబర్ 22, 2023న, అవతార్ 4 డిసెంబర్ 12, 2025 న, అవతార్ సీరీస్ లో చివరి సినిమా అవతార్ 5 డిసెంబర్ 17, 2027 న రిలీజ్ అవుతాయని అవతార్ యూనిట్ ప్రకటించింది.అవతార్-1 సినిమాను రూ.1,648 కోట్లతో తెరకెక్కించగా, ఏకంగా రూ.రూ.20,455 కోట్ల కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -