Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ విష‌యం మా నాన్నకు తెలిస్తే చంపేస్తారు – జాన్వీ క‌పూర్‌

- Advertisement -

అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ధ‌డ‌క్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో బాలీవుడ్ జ‌నాల‌ను ఫిదా చూసిన ఈ భామ తాజాగా త‌న రెండో సినిమాకు ఫిక్స్ చేసింది. ఓ ప‌క్క సినిమా షూటింగ్‌, మ‌రో ప‌క్క హాట్ హాట్ ఫోటో షూట్‌ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది జాన్వీ. తాజాగా జాన్వీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోషూట్ కోసం జాన్వీ తన జుట్టుని పొట్టిగా కత్తిరించుకుంది.

త‌న జ‌ట్టు క‌త్తిరించుకున్న సంగ‌తి త‌న తండ్రి బోనీ క‌పూర్‌కు తెలియ‌ద‌ని,తెలిస్తే మాత్రం నన్ను చంపేస్తార‌ని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే జాన్వీ క‌పూర్ ఐఏఎఫ్ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో న‌టిస్తోంది. ఇటీవ‌ల జాన్వీ పైలట్ దుస్తుల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ సినిమాతో పాటు జాన్వీ క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మిస్తున్న ‘తక్త్’ అనే చారిత్రాత్మక చిత్రంలో కూడా న‌టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -