ధడక్’ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ తన అందం, టాలెంటుతో బాలీవుడ్లో మంచి జోరుమీదుంది. ఇండస్ట్రీలో టాప్ రేంజికి ఎదగడానికి కేవలం నటనను మాత్రమే నమ్మకుంటే సరిపోదా? ఎక్స్ పోజింగ్ తప్పదు అనుకుందో ఏమో గాని జాహ్నవి నెటిజన్ల విమర్శల జడిలో చిక్కుకుంది.
తాజాగా జాహ్నవి కపూర్ ధరించిన పింక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో షార్ట్ కానీ, ప్యాంట్ కానీ వేసుకోకుండా కేవలం టాప్ మాత్రమే ధరించి దర్శనమిచ్చింది. జాన్వీ దుస్తులపై నెటిజన్లు తెగ ఫైర్ అయిపోతున్నారు. ఆమె నిండైన దుస్తులు ధరించాల్సింది అంటూ వారు విరుచుకుపడుతున్నారు. ఆమె ప్రమేయం లేకుండా వెలుగులోకి వచ్చిన ఫొటోల వల్ల ఈ రచ్చ అంతా జరుగుతుండటం గమనార్హం.
ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందని, పబ్లిక్ ప్రదేశాల్లో మరీ ఇలాంటి అవతారంలో తిరగడం కాస్త అభ్యంతరకరమే అనే కామెంట్స్ చేస్తున్నారు. జాహ్నవికి కూడా మీడియా పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని, కావాలని ఫోటోగ్రాఫర్ల కంట పడేలా ఇలా ఎక్స్ ఫోజింగ్ వేషాలు వేస్తోందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే జాన్వీ కపూర్ ఫొటోలను తీయడానికి ఫొటో గ్రాఫర్లు తరచూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవలే ఆమె ఇంటి బయట రోడ్డు మీదకు వచ్చిన సమయంలో ఎవరో ఫొటో గ్రాఫర్ కెమెరాకు పని చెప్పాడు. ఆ సమయంలో జాన్వీ చిట్టిపొట్టి వస్త్రధారణలో ఉండింది. ఆ ఫొటో గ్రాఫర్ ఫొటోలను ఇంటర్నెట్ లోకి అప్‌లోడ్ చేశాడు, ఇంకేముంది.. అవి షేర్ అయిపోయాయి. నెటిజన్లు జాన్వీకి నీతులు చెప్పడం మొదలుపెట్టారు.