Saturday, May 11, 2024
- Advertisement -

నేను ప్రేమలో ఉన్నాను, కానీ అంటున్న జాన్వీ కపూర్

- Advertisement -

బాలీవడ్ అగ్ర నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధఢక్ అనే సినిమా తో సినిమా ప్రవేశం చేసింది. అయితే ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా లో జాన్వీ తో పని చేసిన ఇషాన్ షాహిద్ కపూర్ కి తమ్ముడు. వీరి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అని మీడియా లో అనేక వార్తలు వచ్చాయి. వాటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్న జాన్వీ ఈ సారి కొంచెం ఘాటుగా స్పందించింది.

ఇదే విషయం పై జాన్వీ కపూర్ స్పందిస్తూ, “నేను ప్రేమలో ఉన్నాను. నిజమే. కానీ నా ప్రేమ కేవలం సినిమాలకి మాత్రమే పరిమితం. నాకు ఇక వేరే విషయాల పైన దృష్టి పెట్టేంత సమయం అస్సలు లేదు. ఇషాన్ ఖత్తర్ నాకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే. మేమిద్దరం కలిసి ఒక సినిమా కి పనిచేయడం వలన ఏర్పడిన స్నేహం అది.” అని జాన్వీ చెప్పింది. పని లో పనిగా మీడియా ని అనవసరం గా పుకార్లని సృష్టించవద్దు అని కూడా హితవు పలికింది. తన వ్యక్తిగత జీవితం గురించి లేనిపోని వార్తలని సృష్టించవద్దు అని ఆమె మీడియా ని కోరింది.

ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్ లో తన రెండో సినిమా కి సంబందించిన షూటింగ్ తో బిజీ గా ఉంది. అంతే కాకుండా సౌత్ లో కూడా జాన్వీ అరంగేట్రం చేయాలి అని చూస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -