Monday, April 29, 2024
- Advertisement -

రంగ‌స్థ‌లంలో చిట్టిబాబు స్టెప్పులు చూడండి

- Advertisement -

సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. మాస్ సాంగ్‌తో వ‌చ్చేనున్నాడు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ తన ‘రంగ‌స్థ‌లం’ సినిమాలో ఓ మాస్ పాట‌లో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే జానీ మాస్ట‌ర్ రూపొందిస్తున్న స్టెప్పులు అలా ఉన్నాయి. కొరియోగ్ర‌ఫీ భిన్నంగా చేస్తూ మాస్‌, ఐట‌మ్ పాటకు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేస్తున్నాడు. 1985 ప్రాంతంలో గోదావరి తీరంలోని రంగస్థలమనే గ్రామం నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. రామ్‌చరణ్ స్పెష‌ల్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. పూల డిజైన్ లుంగీ.. గుబురు గెడ్డంతో కనిపించనున్నాడు.

కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ సేమ్ రామ్‌చ‌ర‌ణ్ మాదిరిగా లుక్‌లో క‌నిపిస్తూ కొరియోగ్ర‌ఫీ చేశాడు. రామ్‌చరణ్ మాదిరి గడ్డం పెంచి.. లుంగీ.. బనియ‌న్ వేసుకొని తన బృందంతో మాస్ డ్రస్సులు వేసుకొని స్టెప్పులు ప్రాక్టీస్ చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

సుకుమార్ సినిమాలో ఐట‌మ్ పాట అంటే ఊపు ఊపాల్సిందే! ఆర్యలో అ.. అంటే అమలాపురం, ఆర్య-2లో రింగరింగా, 100 % లవ్‌లో డియ్యాలో డియ్యాలో పాట‌ల‌న్నీ కుర్ర‌కారులో కిక్కిచ్చే పాట‌లు వ‌చ్చాయి. అదే విధంగా రంగ‌స్థ‌లంలో ఈ ఐట‌మ్ పాట ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.రంగ‌స్థ‌లంలో రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత న‌టిస్తున్న సినిమా వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -