Tuesday, May 7, 2024
- Advertisement -

వీర్రాజు వైసిపికి అమ్ముడుపోయారు…

- Advertisement -

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకీ ఎక్కువ నిధులు కేటాయించ‌క‌పోవ‌డంతో టీడీపీ న‌తేలు మోదీపై ర‌గిలిపోతున్నారు. అంతే రీతిలో రాష్ట్ర భాజాపా నేత‌లు కూడా టీడీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌ల‌ప‌ర్వం ఎక్కుపెట్టారు. ఇక బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలు అయితే ఏపీలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేయడంతో… తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు.

త‌న అధినేత‌నే విమ‌ర్శిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోము వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తమ అధినేతను విమర్శించే హక్కు ఆయనకు లేదన్నారు. పార్టీ పేరుతో ఆయన ఎంత వసూలు చేశారో బీజేపీ నేతలే చెబుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వీర్రాజు వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ ను వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని నిలదీశారు. ఆయనది బీజేపీ అజెండానా? లేక వైసీపీ అజెండానా? అని ప్రశ్నించారు

ఆయన కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలవలేదని… అయినా టీడీపీ ఎమ్మెల్సీని చేసిందని గుర్తు చేశారు. వీర్రాజు వైసీపీకి అమ్ముడు పోయారని… వాళ్ల డైరెక్షన్‌లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

వీర్రాజు టీడీపీ అవినీతికి వారుసలని… తాము నిప్పులాంటి వాళ్లమని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబకు లక్షల కోట్లు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలతోనే మాటల యుద్ధం మొదలయ్యింది. మరి టీడీపీ విమర్శలకు సోము వీర్రాజు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -