Tuesday, May 14, 2024
- Advertisement -

#RRR మా ఆయ‌న లేరు.. క్లారిటీ ఇచ్చిన జీవిత‌

- Advertisement -

బాహుబలిని మించి సినిమా తీయాల‌నే ఆలోచ‌న‌లో ఎస్ఎస్ రాజ‌మౌళి ఉన్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఓ భారీ సినిమా రూపొందిస్తున్న విష‌యం తెలిసింది. ఈ సినిమా మల్టీస్టారర్‌గానే ఉండ‌నుంది. ప్ర‌స్తుతానిక‌యితే అ సినిమాను #RRR గా పిలుస్తున్నారు. వీటి మ‌ధ్య మ‌రో R వ‌చ్చి చేరి #RRRR అవుతుంద‌ని ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో వార్త‌లు బాగా ప్ర‌చార‌మ‌య్యారు. ఆ ఆర్ ఎవ‌రో కాదు సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్‌. రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగితే అలాంటిదేమీ లేద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

#RRR త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ న‌టించ‌డం లేద‌ని జీవిత ప్ర‌క‌టించారు. ఈ విషయంపై రాజశేఖర్ భార్య జీవిత ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ‘‘తమ కూతురు శివానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న‘2 స్టేట్స్‌’’ సినిమా ప్రారంభోత్సవ‌ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు తాను, రాజ‌శేఖ‌ర్ వెళ్లి ద‌ర్శ‌కుడు రాజమౌళిని కలిశాం. మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి రాజమౌళి తమను సంప్రదించలేదు’’ అని చెప్పారు.

జీవిత క్లారిటీతో రాజమౌళి మల్టీస్టారర్‌లో రాజశేఖర్‌ విలన్‌గా న‌టించ‌డం లేద‌ని ప‌క్కాగా తెలిసింది. అయితే పుకారు రావ‌డానికి కార‌ణం ఆర్ అనే అక్ష‌రంతో ప్రారంభ‌మ‌య్యే న‌టుల‌ను తీసుకుంటున్నార‌ని స‌మాచారం. అందుకే ఈ విధంగా ప్ర‌చార‌మైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -