Sunday, May 12, 2024
- Advertisement -

భాగ‌వ‌తాన్ని రామాయ‌ణం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు

- Advertisement -

ఎక్క‌డైనా తండ్రికి త‌గ్గ కొడుకు అని నిరూపించుకుంటారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విచిత్రం కొడుకుకు త‌గ్గ తండ్రి అని చెప్పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ త‌ల్లిదండ్రులే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌. నారా లోకేశ్ వ‌రుస త‌ప్పిదాల‌తో కమెడియ‌న్‌గా మారిపోయాడు.

ఇప్పుడు కొడుకు ప‌క్క‌న చంద్ర‌బాబు కూడా చేరిపోయి న‌వ్వుల‌పాల‌య్యేలా అయ్యారు. ఇటీవ‌ల వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలోని ఒంటిమిట్ట రామాల‌యంలో శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించి పూజ‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న భ‌క్తులను ఉద్దేశించి కొన్ని మాట‌లు మాట్లాడారు. అప్పుడు ఆయ‌న అవివేకం బ‌య‌ట‌ప‌డింది.

రామాయ‌ణం ఎవ‌రూ రాశారు అని ఏ చిన్న‌పిల్లాడిని అడిగినా వాల్మీకి అని చెబుతారు. కానీ మ‌న చంద్ర‌బాబు నాయుడు మాత్రం పోత‌న అని చెప్పేశాడు. అంతేకాకుండా త‌న‌కు తెలిసిన విష‌యాల‌న్నీ చెప్పేశాడు.

ఒంటిమిట్ట‌లో బమ్మెర పోతన రామాయణం రాసి కోదండరామస్వామికి అంకితమిచ్చారంటూ చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘కోదండరామస్వామి ఆలయం చారిత్ర‌క ఆలయం. ఆ చరిత్రను ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోని ఈ ఆల‌యాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆ రోజు బమ్మెర పోతన ఇక్కడనే రామాయణం రాసి.. కోదండ రాముడికి అంకితం చేసిన విషయం కూడా మనం అంద‌రం గుర్తుపెట్టుకోవాలి’ అని చంద్ర‌బాబు నొక్కి చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బమ్మెర పోతన ‘వీరభద్ర విజయము’, ‘భోగినీ దండకము’, ‘మహా భాగవతము’, ‘నారాయణ శతకము’ వంటి రచనలు చేశారు. రామాయణాన్ని పోతన రచించలేదనే విషయం చంద్రబాబుకు తెలియదేమో!

సహజ పండితుడు బమ్మెర పోతన మహాకవి తెలుగువారందరికీ సుపరిచితులే. ఆయన రచించిన ‘ఆంధ్ర మహా భాగవతం’లోని పద్యాలు, కీర్తనలు తెలుగువారికి నోటికి అలవోకగా వస్తాయి. ఇప్పటికీ తేనెలొలుకు ఆ తెలుగు పద్యాలు తెలుగువారి నోట జాలువారుతుంటాయి. మరీ ఈయ‌న గురించి ఇంకెన్ని జోకులు పేలుతాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -