ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీ ఖరారైంది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ నిర్మిస్తుండటం..ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి బడా స్టార్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా విడుదల కరోనా కారణంలో ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది.
తాజాగా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాని మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన అలియాభట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ కారణంగా ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఎట్టకేలకు 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించినా సాధ్యపడలేదు.
దాంతో.. మార్చి 18, ఏప్రిల్ 28.. ఈ రెండింటిలో ఏదో ఒకరోజు విడుదల చేసే అవకాశం ఉందంటూ ఇటీవల చిత్ర బృందం ట్వీట్ చేసింది. అనూహ్యంగా ఇప్పుడు మార్చి 25ను ఫిక్స్ చేసింది. చిత్ర యూనిట్ సినిమా తేదీని ట్విట్టర్ వేదికగా ప్రకటించేసింది. దీంతో ఇన్ని రోజులు నుంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఖుషీ అవుతున్నారు.
మెన్స్ టాయిలెట్‌లోకి వెళ్లిన హీరోయిన్స్.. అలా చేస్తే తప్పేంటి ?
ఖిలాడీ డైరెక్టర్‌కు ఓ రేంజ్ గిఫ్ట్
ఒకే సారి 20 వేల థియేటర్లలో ఆదిపురుష్