మెన్స్ టాయిలెట్‌లోకి వెళ్లిన హీరోయిన్స్.. అలా చేస్తే తప్పేంటి ?

- Advertisement -

జీవితంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చేయకూడదన్నవీ .. ఒక్కోసారి చేస్తూ ఉంటాం. ఇలాంటి ఓ సంఘటన బాలీవుడ్ భామలు దీపికా పదుకొనె, ఆలియా భట్ రియల్ లైఫ్ లోనూ జరిగింది. ప్రస్తుతం ‘గెహ్రాహియా’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు ఆ చిత్ర నటీనటులు దీపికా, అనన్యా పాండే, సిద్దార్థ్‌ చతుర్వేది. ఆ ప్రచార కార్యక్రమంలో దీపిక, అనన్యలకు యాంకర్‌ ఊహించని ప్రశ్న వేయడం అసలు విషయం బయటపడింది.

ఎప్పుడైనా మీరు పురుషుల వాష్‌రూమ్‌కి వెళ్లారా’’ అని యాంకర్ అడగడంతో చూడటానికి పరిశుభ్రంగా అనిపిస్తే కచ్చితంగా వెళ్తా’’ అని అనన్య బదులిచ్చింది. బహుశా దీపిక అలా మెన్స్‌ వాష్‌రూమ్‌కి ఎప్పటికీ వెళ్లకపోవచ్చు అని హీరో సిద్దార్థ్‌ చతుర్వేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈలోపు దీపిక ఎవరికీ తెలియని విషయాన్ని పంచుకుంది. ఊహించని పరిస్థితుల్లో మెన్స్‌వాష్‌ రూమ్‌కి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా వెళ్తా. వాస్తవానికి అలాంటి ఓ సంఘటన నా జీవితంలో జరిగిందని చెప్పకొచ్చింది.

- Advertisement -

ఒకానొకొక సందర్భంలో మెన్స్‌ వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఓ సారి బెర్లిన్‌లో జరిగిన మ్యూజికల్‌ కోల్డ్‌ప్లే కన్సర్ట్‌కి నేనూ, అలియాభట్‌ వెళ్లాం. షో అయ్యాక వాష్‌రూమ్‌కి వెళ్దామనుకుంటే ఉమెన్స్‌ వాష్‌రూమ్‌ వద్ద పెద్ద క్యూ ఉంది. ఇక చేసేది లేక ఇద్దరం మెన్స్‌ వాష్‌రూమ్‌కి వెళ్లాం. అలాంటి సందర్భాల్లో.. అది మెన్స్‌ వాష్‌రూమా.. వాష్‌రూమ్‌ క్లీన్‌గా ఉందా? లేదా? అని అనేది విషయం కాదు. ఎలాంటి పరిస్థితి అయినా నేను, అలియా మాత్రం పార్టర్న్స్‌ ఇన్‌ క్రైమ్‌ అని ఆరోజు జరిగిన సంఘటనను పంచుకుంది.

ఖిలాడీ డైరెక్టర్‌కు ఓ రేంజ్ గిఫ్ట్

ఒకే సారి 20 వేల థియేట‌ర్ల‌లో ఆదిపురుష్

నెగటివ్‌ రోల్‌లో నాగ చైతన్య

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -