Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్టీఆర్ అభిమానుల‌కు అస‌లైన ప‌రీక్ష పెట్ట‌నున్న అర‌వింద స‌మేత‌

- Advertisement -

భారీ అంచ‌నాల న‌డుమ ఈ శుక్ర‌వారం విడుదల కానుంది ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌.మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా శుక్ర‌వారం నాడు విడుద‌ల కానుంది. వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. అజ్ఞాత‌వాసి వంటి ప్లాప్ త‌రువాత త్రివిక్ర‌మ్ తీస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ వ‌రుస హిట్లు అయితే కొడుతున్నాడు కాని ,వాటిని బ్లాక్ బ్లాస్ట‌ర్లుగా మ‌ల‌చ‌లేక‌పోతున్నాడు. ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ లేవ‌ల్లో రికార్డ‌లు క్రియేట్ చేశాడు.

రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు త‌మ సినిమాల‌తో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సృష్టించిన సంగ‌తి తెలిసిందే.తెలుగులో టాప్ హీరో అయిన ఎన్టీఆర్ మాత్రం త‌న సినిమాలతో హిస్ట‌రి క్రియేట్ చేయ‌లేక‌పోతున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తున్న అర‌వింద స‌మేతతో ఈ లెక్క‌లను స‌రిచేసే ప‌నిలో ప‌డ్డాడు ఎన్టీఆర్‌. ద‌స‌రా పండ‌గ సీజ‌న్ కావ‌డంతో పాటు,బ‌రిలో మ‌రో సినిమా లేక‌పోవ‌డం ఎన్టీఆర్‌కు మ‌రింత క‌లిసి వ‌చ్చే అంశం. టాలీవుడ్ యంగ్ సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా 100 కోట్ల మార్కెట్ చేరిన ఈ త‌రుణంలో ,మరి ఎన్టీఆర్ అర‌వింద స‌మేత సినిమా తెలిక‌గానే 100 కోట్లు సాధిస్తుంద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక సినిమాకు హిట్ టాక్ వ‌స్తే ఈజీగానే 200 కోట్ల మార్కెట్‌ను అందుకోవ‌డం ఖాయం అని చెబుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మ‌రి ఈ సినిమాను ఎంత‌టి రేంజ్ హిట్‌గా నిలుపుతారో ఎన్టీఆర్ అభిమానుల మీద ఆధార‌ప‌డి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -