Thursday, May 16, 2024
- Advertisement -

కేసీఆర్‌, అస‌దుద్దీన్ ఓవైసీలే టార్గెట్‌గా అమిత్‌షా విమ‌ర్శ‌లు

- Advertisement -

చాలాకాలంగా దక్షిణాదిపై గురిపెట్టిన బీజేపీ.. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటివరకు ఒక్క కర్ణాటక మినహా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ అంతగా ప్రభావం చూపించలేని ఆ పార్టీ.. ఈసారి తెలంగాణ ఎన్నికలపై సీరియస్‌గానే ఫోకస్ చేసింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌రీనంన‌గ‌ర్‌లో భారీ బ‌హిరంగ ష‌భ నిర్వ‌హించి ఎన్నిక‌ల శంఖారావం పూరించారు కాషాయం భాస్ అమిత్‌షా. కేసీఆర్‌, అస‌దుద్దీన్ ఓవైసే ల‌క్ష్యంగా నిప్పులు చెరిగారు.

రజాకార్ల దురాగతాలను తెలంగాణ సమాజం మరచిపోగలదా అని బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఒవైసీకి భయపడే కేసీఆర్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పక్కనబెడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ విమోచనం పొందిన రోజు సెప్టెంబర్ 17ను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సమరయోధుల త్యాగాలను అవమానపరుస్తుందన్నారు. తామ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.

ఓవైసీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు, టీడీపీకి లేదని అమిత్ అన్నారు. ఎంఐఎంను ఎదిరించే సత్తా ఉన్న పార్టీ ఒక్క బీజేపీనే అని పేర్కొన్నారు. బీజేపీకి పట్టంకట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒవైసీ బారి నుంచి విముక్తి కల్పించాలని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం వచ్చాక మోదీ రూ.ఒక లక్షా 15,900 కోట్లకు పైగా తెలంగాణ అభివృద్ధి కోసం నిధులిచ్చారని.. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ. 2లక్షల 30 వేల కోట్ల నిధులిచ్చారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ కుటుంబం వల్లో.. రాహుల్ కంపెనీ వల్లో సాధ్యం కాదు అని అమిత్ షా స్పష్టం చేశారు.

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించడాన్ని సమర్థిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నా. సుప్రీంకోర్టు ప్రకారం 50 శాతం కన్నా రిజర్వేషన్ మించకూడదు. అలాంటపుడు మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో ఎవరికి కోత పెడతావని ప్రశ్నిస్తున్నా. ఎవరికీ కోత పెట్టకుండా రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కేసీఆర్ రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -