Sunday, May 5, 2024
- Advertisement -

అర‌వింద స‌మేత ’ పెనివిటి ’ వచ్చేసింది…!

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా అర‌వింద స‌మేత‌.ద‌స‌రాకు విడుద‌ల కానున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌,సాంగ్‌కు మంచి స్పందన వ‌చ్చింది.తాజాగా ఈ సినిమాలోని మ‌రో సాంగ్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.పెనివిటి అనే సాంగ్ ఈ రోజు సాయంత్రం యూట్యూబ్ ద్వారా విడుద‌ల చేశారు.పాట‌ల ర‌చ‌యిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.పాట‌ను వింటుంటే హృద‌యాన్ని హ‌త్తుకునేలా ఉంది. ఇది సినిమాలోని ఎమోష‌న్‌ని బ‌య‌ట‌పెట్టే విధాంగా ఉంద‌ని తెలుస్తుంది.

త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌నున్నారు.అయితే విడుదలకు ముందే ఈ పాట సోషల్ మీడియాలో అంచనాలను పెంచేస్తుంది.పాట‌లోని కొన్ని లిరిక్స్‌ని రామజోగయ్య శాస్త్రి అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.సినిమాను అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -