Friday, May 17, 2024
- Advertisement -

పవర్ స్టార్ ఆడియో వేడుకకు ఎన్టీఆర్‍

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ సినిమా ఆడియో ఫంక్షన్‍కి ముఖ్య అతిధిగా హాజర్‍ కాబోతున్నాడు. అవును ఇది నిజమే కానీ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం కాదులెండి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమా ఆడియో ఫంక్షన్‍కి వేళ్ళానున్నాడట.

చక్రవ్యూహ్ అనే చిత్రంలో పునీత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్‍కి ఎన్టీఆర్ వేళ్ళానున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఅర్ పాట కూడా పాడాడు. ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ అంటుంది. వచ్చే నెల ఫిబ్రవరిలో ఈ సినిమా ఆడియో వేడికను  జరపడానికి ప్లాన్ చేస్తున్నారు.

అందులో భాగంగా ముందే ఎన్టీఆర్‍కు అహ్వానం పంపారట. ఎన్టీఆర్ కూడా అడిగిన వేంటనే ఖచ్చితంగా ఆడియో వేడుకకు వస్తాను అని తెలిపారట. శరవణన్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమా లో పునీత్ సరసన రచితా రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. సో పునీత్‍తో ఉన్న ఫ్రెండ్ షిప్ వల్ల ఈ ఆడియో వేడుకకు ఎన్టీఆర్ వేలుతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -